తెలుగు బిగ్ బాస్ కోసం పాయల్ రాజ్ పుత్

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్.ఈ అమ్మడు మొదటి సినిమాతోనే గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించి అందరి దృష్టిని ఆకర్షించింది.

 Payal Rajput Entry In Telugu Bigg Boss Season 5, Rx100 Movie, Tollywood, Telugu-TeluguStop.com

దీంతో ఒక్కసారిగా తెలుగులో పాయల్ కి అవకాశాలు క్యూ కట్టాయి.అయితే దురదృష్టం కొద్ది స్టార్స్ తో చేసిన సినిమాలలో పాయల్ రాజ్ పుత్ చేసిన పాత్రలకి పెద్దగా గుర్తింపు రాలేదు.

ఆమె సోలోగా చేసిన ఫిమేల్ సెంట్రిక్ కథలు పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.దీంతో ప్రస్తుతం అనుకున్న స్థాయిలో టాలీవుడ్ లో పాయల్ స్పీడ్ లేదని చెప్పాలి.

ఈ నేపధ్యంలో ఈ మధ్య పంజాబీలో స్టార్ హీరో సినిమాకి పాయల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ బ్యూటీ గురించి టాలీవుడ్ ఓ హాట్ న్యూస్ వినిపిస్తుంది.

బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 5 కోసం తెలుగులో రంగం సిద్ధం అవుతుంది.గత సీజన్ లో మోనాల్ గజ్జర్ ని భారీగా రెమ్యునరేషన్ ఇచ్చి బిగ్ బాస్ హౌస్ కోసం ఎంపిక చేశారు.

అలాగే ఆమెని చివరి వరకు హౌస్ లో ఉంచారు.

Telugu Payal Rajput, Rx, Telugu, Tollywood-Movie

అది కొంత వరకు భాగానే వర్క్ అవుట్ అయ్యింది.ఈ నేపధ్యంలో ఈ సీజన్ 5 లో కూడా ఒక హీరోయిన్ ని బిగ్ బాస్ హౌస్ పార్టిసిపెంట్ గా తీసుకోవాలని ప్లాన్ చేసి పాయల్ రాజ్ పుత్ పై నిర్వాహకులు దృష్టి పెట్టారని టాక్.ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరిపారని, రెమ్యునరేషన్ కూడా గట్టిగా ఇవ్వడంతో హౌస్ లోకి వెళ్ళడానికి పాయల్ కూడా రెడీగా ఉందనే మాట వినిపిస్తుంది.

ఆమె హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం గ్లామర్ షోకి ఎలాంటి కొదవ ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube