సక్సెస్ ఇచ్చిన కిక్కు? తన రేటు పెంచిన ఆర్ ఎక్స్ బ్యూటీ  

భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న పాయల్ రాజ్ పుత్. .

Payal Rajput Demand Remuneration-

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. ఈ భామ మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ కి కావాల్సిన హాట్ అందాలు, మరో వైపు అదిరిపోయే బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో కట్టి పడేసింది. దీంతో సినిమా సూపర్ సక్సెస్ అందుకొని ఆమె ఇమేజ్ ని అమాంతం పెంచేసింది. ఆర్ఎక్స్ మూవీ సక్సెస్లో మెజార్టీ క్రెడిట్ దర్శకుడు, హీరోయిన్ లకే దక్కుతుంది..

సక్సెస్ ఇచ్చిన కిక్కు? తన రేటు పెంచిన ఆర్ ఎక్స్ బ్యూటీ-Payal Rajput Demand Remuneration

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ భామ తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటుంది.

ఓ వైపు మాస్ మహారాజ్ రవితేజతో అలాగే వెంకి మామలో వెంకటేష్ తో జత కట్టింది. అలాగే సి కళ్యాణ్ ప్రొడక్షన్ నిర్మాణంలో కొత్త సినిమా స్టార్ట్ చేసింది.

అయితే ఆర్ ఎక్స్ సినిమా పుణ్యమా అని ఇప్పుడు ఈ భామ రెమ్యునరేషన్ ఐదు రెట్లు పెంచేసి. ఏకంగా 30 నుంచి 50 లక్షల వరకు డిమాండ్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇక నిర్మాతలు కూడా అడిగినంత ఇచ్చి ఆమె డేట్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది.