మరోసారి పెర్ఫార్మెన్స్ తో ఫిదా చేస్తున్న పాయల్ రాజ్ పుత్

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్.మొదటి సినిమాతోనే అటు గ్లామర్ తోనే ఇటు పెర్ఫార్మెన్స్ తోను ఇరగదీసి అందరి మన్ననలు ఈ అమ్మడు సొంతం చేసుకుంది.

 Payal Rajput Deglamour Role In Anaganaga O Athidhi, Tollywood, Telugu Cinema, Di-TeluguStop.com

దీంతో టాలీవుడ్ లో వరుసగా మంచి అవకాశాలనే సొంతం చేసుకుంది.అయితే వెంకటేష్, రవితేజతో చేసినవి కమర్షియల్ సినిమాలు కావడం వలన ఆమె పెర్ఫార్మ్ చేయడానికి స్కోప్ లేకుండా పోయింది.

సరైన క్యారెక్టర్ పడితే తనలోనే నటిని చూపించడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాయల్ రాజ్ పుత్ కి అదిరిపోయే రేంజ్ లో నేషనల్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేయడానికి కావాల్సిన స్థాయిలో పాత్ర దొరికింది.పూర్తి డీగ్లామర్ పాత్రలో టీజర్ లోనే ఆమె అదిరిపోయే రేంజ్ లో తన పెర్ఫార్మెన్స్ చూపించేసింది.

అనగనగా ఒక అతిథి అనే సినిమాలో పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో నటించింది.ఇందులో చైతన్య కృష్ణ మరో కీలక పాత్రలో నటించాడు.

ఈ సినిమాలో త్వరలో ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.దీనికి సంబందించిన టీజర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.పద్మనాభం ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు.కన్నడంలో హిట్ అయిన ఆ కరలరాత్రి సినిమాకి ఇది రీమేక్ గా తెరకెక్కింది.

ఇందులో ఒక గిరిజన యువతి పాత్రలో పాయల్ రాజ్ పుత్ కనిపిస్తుంది.ఆమె పాత్రలో రెండు విభిన్న షేడ్స్ కనిపిస్తున్నాయి.

ఓ పక్క అమాయక యువతిగా, మరో వైపు నెగిటివ్ షేడ్స్ లో పాయల్ రాజ్ పుత్ పూర్తి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలో కట్టిపడేసింది.ఈనెల 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube