చిన్నపిల్లలా ఏడ్చేసిన పాయల్ రాజ్‌పుత్.. వీడియో వైరల్!  

payal rajput cries screams like a child during covid 19 test Payal Rajputh, RX100, Covid Test, Directors And Producers, Payal Cries Like A Child - Telugu \\'rx 100\\', Lock Down, Payal Corona Test, Payal Rajput

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల 2020 సంవత్సరంలో భారీగా నష్టపోయిన రంగాల్లో సినీ రంగం ఒకటి.మార్చి నెల చివరి వారం నుంచి కరోనా కారణంగా షూటింగులు ఆగిపోగా కొన్ని రోజుల క్రితం నుంచి షూటింగుల సందడి మొదలైంది.

TeluguStop.com - Payal Rajput Cries Screams Like A Child During Covid 19 Test

వైరస్ సోకకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ దర్శకనిర్మాతలు షూటింగ్ లను ప్లాన్ చేసుకుంటున్నారు. లాక్ డౌన్ వల్ల సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన హీరోయిన్లు సైతం హైదరాబాద్ కు తిరిగి వస్తున్నారు.

అలా సొంత రాష్ట్రానికి వెళ్లిన పాయల్ రాజ్ పుత్ కూడా ఇటీవల హైదరాబాద్ కు వచ్చి ఒక షూటింగ్ లో పాల్గొంది.అయితే దర్శకనిర్మాతలు ఎందుకైనా మంచిదని పాయల్ కు కరోనా పరీక్ష చేయించారు.

TeluguStop.com - చిన్నపిల్లలా ఏడ్చేసిన పాయల్ రాజ్‌పుత్.. వీడియో వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ముక్కు ద్వారా పాయల్ నుంచి స్వాబ్ సేకరించగా పాయల్ చిన్నపిల్లలా వెక్కివెక్కి ఏడ్చింది.తను ఏడ్చిన వీడియోను పాయల్ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసింది.

ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది.

సినిమాల్లో ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే పాయల్ చిన్నపిల్లలా ఏడవటంపై పలువురు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

ఆర్.ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన పాయల్ కు ఆ సినిమా తరువాత సరైన విజయం దక్కలేదు.స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వచ్చినా సరైన గుర్తింపు మాత్రం దక్కలేదు.సరైన సక్సెస్ లేకపోయినా పాయల్ కు వరుస అవకాశాలు దక్కుతుండటం గమనార్హం.

మరోవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తూ ఉండటంతో దర్శకనిర్మాతలు అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ లు జరిగే దిశగా అడుగులు వేస్తున్నారు.పాయల్ వీడియో గురించి మాట్లాడుతూ అన్ని జాగ్రత్తలు తీసుకుని సెట్ లోకి అడుగు పెట్టానని.

శాంపిల్స్ తీసుకోవడం భయంగా, ఇబ్బందిగా అనిపించిందని అన్నారు.ఫలితం నెగిటివ్ రావడంతో కంగారు తగ్గిందని వెల్లడించారు.

#Lock Down #Payal Rajput #'RX 100'

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Payal Rajput Cries Screams Like A Child During Covid 19 Test Related Telugu News,Photos/Pics,Images..