బాలయ్యతోనా.. వామ్మో అంటోన్న బ్యూటీ

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో నటించేందుకు రెడీ అయ్యారు.ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రారంభించిన చిత్ర యూనిట్ త్వరలో షూటింగ్‌ను మొదలుపెట్టనుంది.

 Payal Rajput Clarity On Movie With Balayya-TeluguStop.com

అయితే ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో మనకు కనిపిస్తాడని చిత్ర యూనిట్ తెలిపిన సంగతి తెలిసిందే.కాగా బాలయ్య సరసన హీరోయిన్ పాత్రలో ఎవరు నటిస్తారా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‌గా ఆర్ఎక్స్100 సినిమా బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ నటిస్తుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తెగ హల్‌చల్ చేస్తుంది.అయితే ఈ విషయంపై పాయల్ తాజాగా క్లారిటీ ఇచ్చింది.

తాను బాలయ్య సినిమాను ఓకే చేసిన వార్తలో ఎంతమాత్రం నిజం లేదని ఆమె కుండబద్దలు కొట్టింది.ఈ సినిమా గురించి తనను ఎవరూ సంప్రదించలేదని ఆమె తెలిపింది.

దీంతో బాలయ్య సినిమాలో పాయల్ నటిస్తుందనే వార్తకు తెరపడిందని పలువురు అంటున్నారు.

కాగా పాయల ప్రస్తుతం జయంత్ సి పరాన్జి డైరెక్షన్‌లో నరేంద్ర అనే సినిమాలో నటిస్తోంది.

అటు తమిళంలోనూ ఓ సినిమా చేసేందుకు పాయల్ పాప రెడీ అవుతోంది.మొత్తానికి బాలయ్య సినిమాలో పాయల్ పాప నటిస్తోందనే వార్త గాలివార్తగానే మిగిలింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube