అది నేను చెయ్యట్లేదు అంటూ క్లారిటీ ఇచ్చిన పాయల్..!

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్.ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఈ హాట్ బ్యూటీ.తొలిసారి నటనకు మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఇక తన అందాలతో తెగ పిచ్చెక్కిస్తుంది.అతి తక్కువ సమయంలో ఓ క్రేజ్ అందుకున్న పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేయడమే కాకుండా.వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది.

 Payal Rajput Clarity On Bangarraju Movie Special Song, Payal,bangarraju Movie, N-TeluguStop.com

2017 లో పంజాబీ సినిమా ద్వారా వెండితెరపై పరిచయమైన పాయల్.ఈ సినిమాతో తన నటనకు మంచి గుర్తింపు అందుకొని ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది.ఆ తర్వాతి ఏడాది ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ఈ సినిమాతో ఓవర్ నైట్ లో మంచి క్రేజ్ ను అందుకున్న ఈ హాట్ బ్యూటీ.ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంది.కానీ ఈ సినిమాకు అందుకున్నంత క్రేజ్ మాత్రం తర్వాత సినిమాలకు అందుకోలేకపోయింది.ఇదిలా ఉంటే ఓ విషయం గురించి క్లారిటీ ఇచ్చింది పాయల్.

హీరోయిన్ గానే కాకుండా పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది.సీత సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించగా మంచి రెస్పాన్స్ అందుకుంది.

Telugu Bangarraju Item, Bangarraju, Item, Nagarjuna, Payal, Payal Rajput, Rx, To

అలా స్పెషల్ సాంగ్ లో మెప్పించిన పాయల్.అక్కినేని నాగార్జున నటించనున్న బంగార్రాజు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.అంతేకాకుండా ఈ పాట కోసం పాయల్ ను సంప్రదించారని ప్రచారాలు కూడా జరిగాయి.దీంతో ఈ విషయం గురించి పాయల్ స్పందిస్తూ.తను ఏ స్పెషల్ సాంగ్ లో కనిపించడం లేదని క్లారిటీ ఇస్తూ పుకార్లను తోసిపుచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube