హైదరాబాద్ లో ఫ్లాట్ కొనుగోలు చేసిన పాయల్.. ఖరీదెంతంటే?

తెలుగులో తక్కువ సినిమాలే చేసినా పాయల్ రాజ్ పుత్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.ఈ బ్యూటీకి మహేష్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కే సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది.

 Payal Rajput Buys A Luxurious Flat In Hyderabad-TeluguStop.com

పాయల్ రాజ్ పుత్ తొలి సినిమా ఆర్ ఎక్స్ 100తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఆ తర్వాత వెంకీమామ, డిస్కో రాజా, ఆర్డీఎక్స్ లవ్ సినిమాలలో నటించి పాయల్ తన నటనతో మెప్పించారు.

ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ ముంబైలో జీవనం సాగిస్తున్నారు.

 Payal Rajput Buys A Luxurious Flat In Hyderabad-హైదరాబాద్ లో ఫ్లాట్ కొనుగోలు చేసిన పాయల్.. ఖరీదెంతంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హైదరాబాద్ కు వచ్చిన సమయంలో మాత్రం పాయల్ హోటళ్లలో ఉంటున్నారు.

అయితే తెలుగులో సినిమా ఆఫర్లు ఎక్కువగా వస్తుండటంతో పాయల్ హైదరాబాద్ లో కూడా సొంతంగా ఫ్లాట్ ఉంటే బాగుంటుందని భావించి ఖరీదైన ఫ్లాట్ ను కొనుగోలు చేశారని తెలుస్తోంది.ఫ్లాట్ ను కొనుగోలు చేయడం గురించి పాయల్ రాజ్ పుత్ స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

హైదరాబాదీ అమ్మాయిగా మారడం సంతోషాన్ని కలిగిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు.

టాలీవుడ్ ప్రేక్షకులు తనను ఆదరిస్తున్న తీరు వల్ల ప్రేక్షకులకు మరింత చేరువ కావాలనే ప్రయత్నం చేస్తున్నానని పాయల్ కామెంట్లు చేశారు.టాలీవుడ్ లో మరిన్ని ఎక్కువ సినిమాలు చేయాలని భావిస్తున్నానని అందుకే ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నానని పాయల్ చెప్పుకొచ్చారు.బాయ్ ఫ్రెండ్ సౌరభ్ ఫ్లాట్ ను కొనుగోలు చేయడంలో సహాయం చేశాడని పాయల్ తెలిపారు.

తన అభిరుచికి తగిన మంచి ఫ్లాట్ ను సౌరభ్ కొనుగోలు చేసి ఇచ్చాడని పాయల్ చెప్పుకొచ్చారు.

తన బాయ్ ఫ్రెండ్ ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ పనులను చూసుకోవడంతో పాటు రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను కూడా చూసుకున్నాడని పాయల్ అన్నారు.పాయల్ కొనుగోలు చేసిన లగ్జరీ ఫ్లాట్ ఖరీదు కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తమని సమాచారం.

#Payal Rajput #Flat #Venky Mama #Payal #Saurabh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు