ఈ ఫొటోలో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఇండస్ట్రీలో బోల్డ్ బ్యూటీ.. ఎవరో తెలుసా?

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హీరో, హీరోయిన్ లు, అలాగే సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి.ఈ మధ్య కాలంలో అయితే త్రోబ్యాక్ ఫోటోలు షేర్ చేయడం ఎక్కువ అయిపోయింది.

 Payal Rajput Birthday Payal Rajput Childhood Photo Goes Viral Payal Rajput, Chil-TeluguStop.com

సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టండి అంటూ ట్యాగ్ చేస్తూ ఉంటారు.ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో హీరోయిన్ కి సంబంధించి చిన్నప్పటి ఫోటో వైరల్ అవుతోంది.

అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ చిన్నారి ఫోటోని కొందరు ఇట్టే గుర్తుపట్టేస్తున్నారు.ఆ చిన్నారి ఎవరో కాదు.

టాలీవుడ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్.ఆర్ ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు మతి పోగొట్టి,మొదటి సినిమాతోనే యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

నేడు పాయల్ రాజ్ పుత్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫ్యాన్స్ ఆమె చిన్నప్పటి ఫోటోని షేర్ చేస్తూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Telugu Rx, Childhood, Payal Rajput, Tollywood-Movie

ఇకపోతే పాయల్ రాజ్ పుత్ సినిమాల విషయానికి వస్తే.ఆర్ఎక్స్ 100 సినిమాలో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఈ సినిమాలో నటనతో, తన అందంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది.

ఆర్ఎక్స్ 100 సినిమా తరువాత ఆర్డిఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజాలాంటి సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాలు పెద్ద విజయాన్ని సాధించలేకపోయాయి.సినిమాల్లో నటించకపోయినా ఇప్పటికీ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.

నిత్యం హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.ప్రస్తుతం ఈమె పలు భాషలలో ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం ఈమె చిన్నప్పటి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube