వెంకి మామలో హీరోయిన్స్ గా పాయల్, రాశి ఫైనల్!

విక్టరీ వెంకటేష్, చైతూ కాంబినేషన్ లో సురేష్ ప్రొడక్షన్ లో బాబి దర్శకత్వంలో వెంకి మామ అనే సినిమా సెట్స్ పైకి వెళ్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఎఫ్ 2 సూపర్ హిట్ తర్వాత వెంకటేష్ నటిస్తున్న మరో మల్టీ స్టారర్ చిత్రం కావడం, అలాగే ఇందులో మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి మొదటి ఫుల్ లెంత్ లో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో దీనిపై టాలీవుడ్ లో మంచి హైప్ వుంది.

 Payal Rajput And Rashi Khanna Are The Heroins In Venki Mama Movie-TeluguStop.com

అలాగే టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ ఈ సినిమాకి కథ అందిస్తూ వుండటంతో దీనిపై మరింత హైప్ క్రియేట్ అవుతుంది.ఇక రీసెంట్ గా ఈ సినిమా ప్రారంబోత్సవం జరుపుకుంది.

ఇదిలా వుంటే ఈ సినిమాలో వెంకటేష్, చైతుకి జోడీగా హీరోయిన్స్ ని ఫైనల్ చేసే పనిలో ఇన్ని రోజులు చిత్ర యూనిట్ ఫుల్ బిజీగా వుంది.మొన్నటి వరకు రకుల్ ప్రీత్ సింగ్, శ్రియ లాంటి హీరోయిన్స్ పేర్లు వినిపించిన ఫైనల్ గా ఇందులో హీరోయిన్స్ గా టాలీవుడ్ ట్రెండీ గర్ల్స్ ని దర్శక, నిర్మాతలు ఫైనల్ చేసారు.

వెంకటేష్ కి జోడీ గా ఆర్ ఎక్స్ తో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ ని ఫైనల్ చేసిన దర్శకుడు, చైతుకి జోడీగా రాశిఖన్నాని ఫిక్స్ చేసారు.మొత్తానికి పాయల్ టాలీవుడ్ లో మొదటి సినిమా సక్సెస్ తర్వాత స్టార్ వెంటనే రవితేజ, ఇప్పుడు వెంకటేష్ తో ఆడిపాడే అవకాశాన్ని సొంతం చేసుకుంది అని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube