ఆర్ ఎక్స్ 100 సినిమాతో సంచలన విజయం సాధించిన డైరెక్టర్ అజయ్ భూపతి( Ajay Bhupathi ) గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా తెలుసు.ఈయన అప్పటి నుండి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
సైలెంట్ గా వచ్చి ఆర్ ఎక్స్ 100 సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.ఈ సినిమాతో బోల్డ్ లవ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసాడు.
ఈ సినిమా తర్వాత మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
మహాసముద్రం( Maha Samudram ) అంటూ తెరకెక్కించగా ఇది అట్టర్ ప్లాప్ అయ్యింది.
అజయ్ భూపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో కాస్త ఢీలా పడ్డాడు.కానీ తన ప్రయత్నం ఆపకుండా మరోసారి ప్రేక్షకుల ముందుకు ”మంగళవారం” సినిమా( Mangalavaram )తో రాబోతున్నాడు.
మరి ఈ పేరుకు తగ్గట్టే ఈ సినిమా అనౌన్స్ మెంట్ నుండి ఇప్పుడు వచ్చిన టీజర్ వరకు అన్ని కూడా మంగళవారం రోజునే ప్రకటించాడు.
ఇక ఈ రోజు వచ్చిన టీజర్ తో అజయ్ భూపతి ఈసారి హిట్ కొడతాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.హారర్ అండ్ థ్రిల్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ తోనే మంచి అటెన్షన్ ను క్రియేట్ చేసుకోవడంతో సఫలం అయ్యింది.సౌత్ భాషల్లో రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాలో పాయల్ రాజపుత్( Payal Rajput ) ప్రధాన పాత్రలో నటించింది.
ఇక ఈ టీజర్ లో మంచి కంటెంట్ తో పాటు ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా థ్రిల్లింగ్ చేసింది.
మరి సీన్ చూస్తుంటే ఈసారి అజయ్ భూపతి హిట్ కొడతాడేమో అని అనిపిస్తుంది.మహాసముద్రంతో దారుణంగా ఫెయిల్ అయిన అజయ్ ఈ సినిమాను కొత్త జోనర్ లో ట్రై చేసి ఆడియెన్స్ ను అలరించడానికి రెడీ అవుతున్నాడు.ఇక ఈ మధ్య హారర్ అండ్ థ్రిల్లింగ్ జోనర్ లో వస్తున్న సినిమాలు హిట్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఎంత మేర ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాలి.