పాయల్‌ ఇకపై ఇలా సెటిల్‌ అవ్వాల్సిందేనా?

పాయల్‌ రాజ్‌ పూత్‌ నెగటివ్‌ రోల్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో మెప్పించిన ఈ అమ్మడు ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది కాని ఎక్కువగా సక్సెస్‌లు రాలేదు.

 Payal Raj Put New Film Anaganaga O Athithi Movie News , Aha Movie, Anaganaga O A-TeluguStop.com

దాంతో ఈమె చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను నిరాశపర్చుతూనే ఉన్నాయి.దాంతో మరోసాని నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రను ఈమె చేసేందుకు ముందుకు వచ్చింది.

ఈ అమ్మడు అనగనగా ఓ అతిథి సినిమాలో ఈమె కనిపించబోతుంది.చైతన్య కృష్ణ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను త్వరలో ఆహాలో విడుదల చేయబోతున్నారు.1980 నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌ పూత్‌ పల్లెటూరు అమ్మాయిగా కనిపించబోతుంది.నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో ఈమె కనిపించబోతుంది.

కత్తి పట్టుకుని పీకలు కోసే దండుపాళ్యం బ్యాచ్‌ తరహాలో ఈ అమ్మడు కనిపించడం అందరికి ఆశ్చర్యంగా ఉంది.తెలుగులో ఈమె ఇకపై వరుసగా ఇలాంటి పాత్రలకే పర్మినెంట్‌ గా ఫిక్స్‌ అవ్వాల్సిందేనా అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఈమె ముందు ముందు మరిన్ని నెగటివ్‌ రోల్స్‌ చేస్తే ఇకపై ఈమెకు హీరోయిన్‌గా ఆఫర్లు వస్తాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.మొత్తానికి ఈ అమ్మడు చేస్తున్న ఈ సినిమా ఆమె కెరీర్‌ను మార్చేస్తుందా అనేది చూడాలి.

ఆహాలో విడుదల కాబోతున్న ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుందా అంటే అనుమానమే అనిపిస్తుంది.ఎందుకంటే ఆమె చాలా కరుడుగట్టిన అమ్మాయిగా కనిపిస్తుంది.అంటే ఈమె ఖచ్చితంగా కాస్త బోల్డ్‌గా నటించే అవకాశం ఉంది.కనుక ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈమెకు దూరం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

పాయల్‌ రాజ్‌ పూత్‌ వెంకటేష్‌ తో వెంకీ మామ సినిమాలో నటించింది.ఆ సినిమా నిరాశ పర్చింది.

ఆ తర్వాత కూడా రవితేజతో సినిమాను చేసినా ఫలితం దక్కలేదు.మొత్తానికి పాయల్‌ కమర్షియల్‌ హీరోయిన్‌గా సక్సెస్‌ అవ్వడం కష్టం అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube