అంతా అమ్మ కనుసన్నల్లోనే చేస్తున్నా అంటున్న పాయల్!

ఆర్ ఎక్స్ 100 సినిమా లో తన బోల్డ్ పర్ఫార్మెన్స్ తో జనాలకు మత్తెక్కించిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్.ఆ చిత్రంలో ఆమె చేసిన బోల్డ్ క్యారెక్టర్ తో కుర్రకారు గుండెల్లో అలజడి సృష్టించింది.

 I Will Discuss Lip Lock Scenes With Mom Says Payal Rajput, Heroine Payal Rajput,-TeluguStop.com

ఆ తరువాత ఆమెకు అంతే ఆఫర్లు కూడా వరుసగా వచ్చేశాయి అనుకోండి అది వేరే విషయం.అయితే ఇప్పుడు తాజాగా పాయల్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ సినిమాల్లో ఆమె చేసే క్యారెక్టర్స్,బోల్డ్ పర్ఫార్మెన్స్ అన్ని కూడా అమ్మ కనుసన్నల్లోనే చేస్తాను అంటూ చెబుతుంది.

ఏదైనా అలాంటి రొమాంటిక్ సీన్స్ వచ్చినప్పుడు అంటే లిప్ లాక్ సీన్స్ వంటివి ముందుగా అమ్మ వద్దకు వెళ్లి చెప్పి,అమ్మ పర్మిషన్ తీసుకొనే అలాంటి సన్నివేశాల్లో నటిస్తాను అంటూ క్లారిటీ ఇచ్చింది.ఆర్ ఎక్స్ 100, తో పాటు ఆర్డీఎక్స్ లవ్ సినిమాలో లిప్ లాక్ లతో రెచ్చిపోయిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పాయల్ ను ప్రశ్నించగా అలాంటి సన్నివేశాల్లో అమ్మ పర్మిషన్ తీసుకుంటాను అని చెప్పి అందరి నోర్లు మూయించేసింది.ఆర్ ఎక్స్ 100, ఆర్దీఎక్స్ సినిమాల్లో పాయల్ తన బోల్డ్ నటనతో వెంటనే వెంకీ మామ సినిమా తో పాటు డిస్కో రాజా వంటి సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది.

ఆమె బోల్డ్ నటనతో మరిన్ని అవకాశాలు దక్కించుకోవాలని పాయల్ చూస్తుంది.అయితే వెంకీమామ చిత్రం లో పాయల్ పాత్ర చెప్పుకోదగ్గ ప్రాముఖ్యత లేదు.

Telugu Payal Rajput, Liplock, Lip Lock, Pushpa Item, Venky Mam-

వెంకీ కి జోడీ గా ఈ చిత్రంలో పాయల్ నటించగా ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వకపోవడం తో పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు.ప్రస్తుతం పాయల్ పాప అల్లు అర్జున్,సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.మొత్తానికి పాయల్ మాత్రం లిప్ లాక్ సీన్ లు చేసే విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పకనే చెప్పేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube