యాక్టివ్ గా ఉండటం కోసం డ్రగ్స్ కి అలవాటు... సీక్రెట్ చెప్పిన పాయల్ ఘోష్

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న ఇష్యూలలో సుశాంత్ ఆత్మహత్య, దాని చుట్టూ అల్లుకున్న డ్రగ్స్ మాఫియా ఒకటిగా ఉంది.ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారం గురించి సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ నడుస్తుంది.

 Payal Ghosh Reveals Dark Secrets About Use Of Drugs, Bollywood, Drugs Mafia, Cel-TeluguStop.com

కరోనా కంటే ప్రజలు ఎక్కువగా బాలీవుడ్ లో డ్రగ్స్ మాఫియా, సుశాంత్ ఆత్మహత్య వెనుక చీకటి కోణంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అంటే దానిని ఇంటెన్సన్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.ఈ డ్రగ్స్ వ్యవహారం కేవలం బాలీవుడ్ లోనే కాకుండా శాండిల్ వుడ్ లో కూడా ఇప్పుడు సంచలనంగా మారింది.

బాలీవుడ్ లో రియా చక్రవర్తిని డ్రగ్స్ వ్యవహారంలో అరెస్ట్ చేయగా, కన్నడనాట ఇద్దరు హీరోయిన్స్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంది.ఎప్పుడు కూడా డ్రగ్స్ భాగోతాలు బయట పడితే సెలబ్రిటీలు, ప్రముఖులు, విఐపీల పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.

ఈ నేపధ్యంలో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు డ్రగ్స్ మాఫియాతో లింకులు కలిగి ఉంటారని అందరూ బలంగా విశ్వసిస్తున్నారు.

ఇక కొంత మంది సెలబ్రిటీలు మీడియా ముందుకి వచ్చి చాలా మంది యాక్టర్స్ డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారని, వారికి అదొక అలవాటుగా మారిపోయిందని చెబుతున్నారు.

అయితే డ్రగ్స్ తీసుకుంటున్న సెలబ్రిటీల పేర్లు చెప్పకపోయిన కూడా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎక్కువగా డ్రగ్స్ కి అలవాటు పడటానికి గల కారణాలని నటి పాయల్ ఘోష్ ఓ మీడియా ఇంటర్వ్యూలో తెలియజేసింది.హీరోయిన్స్ చాలా మంది యాక్టివ్ గా ఉండటం కోసం అలాగే ఫిట్ నెస్, పేస్ లో గ్లో కనిపించడం కోసం డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారనే రహస్యం బయట పెట్టింది.

వయస్సు పెరిగిన ఆ ప్రభావం కనిపించకుండా యాక్టివ్ గా ఉండాలంటే డ్రగ్స్ తీసుకుంటేనే సాధ్యం అవుతుందని చెప్పింది.అలాగే తెరపై మరింత అందంగా కనిపించాలని హీరోయిన్స్ కొన్ని రకాల డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారని స్పష్టం చేసింది.

డ్రగ్స్ శాంపిల్ టెస్ట్ చేస్తే చాలా మంది భాగోతాలు బయట పడతాయని పాయల్ ఘోష్ చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube