ఎన్టీఆర్‌కు అండగా నిలిచిన బ్యూటీ.. ఎవరో తెలుసా?

ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై నటి మీరా చోప్రా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఎలాంటి దుమారం లేపుతున్నాయో అందరికీ తెలిసిందే.తన పట్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారని, తనకు బెదురింపు కాల్స్ వస్తున్నాయని, ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ తరఫున తనకు సారీ చెప్పాల్సిందే అంటూ ఈ బ్యూటీ పోలీసులను ఆశ్రయించింది.

 Payal Ghosh Supports Ntr, Payal Ghosh, Ntr, Meera Chopra, Tollywood News-TeluguStop.com

కాగా తాజాగా ఎన్టీఆర్ ఎలాంటి వ్యక్తో తనకు పూర్తిగా తెలుసంటూ బాంబు పేల్చింది మరో బ్యూటీ.

గతంలో ఎన్టీఆర్ నటించిన ఊసరవెళ్లి సినిమాలో నటించిన బాలీవుడ్ బ్యూటీ పాయల్ ఘోష్, తారక్ చాలా సంస్కారం ఉన్నవాడని, ఆడవారికి ఎలా మర్యాద ఇవ్వాలో ఆయనను చూసి నేర్చుకోవాలంటూ చెప్పుకొచ్చింది.

ఊసరవెళ్లి చిత్ర షూటింగ్ సమయంలో లేడీ ఆర్టిస్టులకు డ్రెస్ ఛేంజ్ చేసుకునేందుకు సరైన సదుపాయం చేయకపోవడంతో తారక్ ఆ చిత్ర యూనిట్‌పై మండి పడిన తీరును ఆమె గుర్తుకు చేసింది.దీంతో తారక్ మహిళల పట్ల ఎలాంటి భావన కలిగి ఉంటాడో అర్ధం చేసుకోవచ్చని ఆమె తెలిపింది.

అయితే ఎవరో చేసిన పనికి తారక్ క్షమాపణలు చెప్పాలని కోరుకోవడం మూర్ఖత్వం అవుతుందని ఆమె అంటోంది.తారక్ లాంటి క్రేజ్ ఉన్న హీరోను టార్గెట్ చేసి వారు లైమ్‌లైట్‌లోకి రావాలని చూస్తున్నారంటూ పాయల్ ఘోష్ పరోక్షంగా మీరా చోప్రాకు కౌంటర్ ఇచ్చింది.

మరి ఆమె వ్యాఖ్యలపై మీరా చోప్రా ఎలా స్పందిస్తుందో చూడాలి అంటున్నారు నందమూరి ఫ్యాన్స్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube