తనకు న్యాయం చేయాలని కేంద్ర మంత్రిని కోరిన పాయల్ ఘోష్

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మీద సినీ నటి పాయల్ ఘోష్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.అనురాగ్ కశ్యప్ తనని లోబరుచుకుని ప్రయత్నం చేసాడని బహిరంగంగా ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పేర్కొంది.

 Payal Ghosh Met Minister Of State Home Affairs, Bollywood, Metoo, Women Harassme-TeluguStop.com

ఈ ఇష్యూ బిటౌన్ లో ఒక్కసారిగా రచ్చలేపింది.ఈ విషయంలో చాలా మంది హీరోయిన్స్ అనురాగ్ కశ్యప్ కి మద్దతుగా నిలబడ్డారు.

అతను అలాంటి వ్యక్తి కాదంటూ సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు.చివరికి ఆర్జీవీ కూడా తన శిష్యుడుకి మిస్టర్ పర్ఫెక్ట్ సర్టిఫికేట్ ఇచ్చేశాడు.

అయితే ఎవరు ఎన్ని ఇచ్చిన కూడా ముంబై పోలీసులు కూడా తాము ఇవ్వాల్సింది ఇవ్వాలని అతనికి నోటీసులు ఇచ్చారు.పాయల్ ఘోష్ ఆరోపణలపై విచారణకి పిలిచారు.

అనురాగ్ కశ్యప్ విచారణకి హాజరై తాను చెప్పాలనుకున్నది చెప్పాడు.ఆమె ఆరోపించిన వివరాల ప్రకారం తాను సినిమా షూటింగ్ కోసం శ్రీలంకలో ఉన్నానని, ఆమె అవాస్తవాలు చెబుతుంది అంటూ సోషల్ మీడియా ద్వారా పాయల్ పై విమర్శలు చేశాడు.
ఇదిలా ఉంటే అనురాగ్ కశ్యప్ పై తాను చేసిన ఆరోపణల విషయంలో వెనక్కి తగ్గేది లేదని పాయల్ ఘోష్ అంటుంది.దీనికోసం ఎంత దూరం అయినావెళ్తానని చెబుతుంది.

తనకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని చెప్పింది.ఈ సందర్భంగా తనకు న్యాయం చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పాయల్ ఘోష్ కలిసి విన్నవించుకుంది.

లిఖిత పూర్వంగా ఫిర్యాదు చేసి ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని వీలైనంత త్వరగా తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరింది.మరి ఓ వైపు అనురాగ్ కశ్యప్ పాయల్ ఘోష్ తప్పుడు ఆరోపణలు చేస్తుందని అంటూ ఉంటే పాయల్ మాత్రం చేసిన ఆరోపణలకి కట్టుబడి న్యాయం కోసం పోరాడుతా అని అంటుంది.

ఈ వ్యవహారం బి-టౌన్ లో ఎంత వరకు వెళ్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube