ఎప్పుడో చేసిన పనికి పాయల్ పాపని నెట్టింట్లో ఆడుకుంటున్నారుగా….  

Payal Ghosh facing negative trolls in social media, Payal Ghosh, negative trolls, Casting Couch issue, Anurag Kashyap, Director, Old Tweet about Casting couch - Telugu Anurag Kashyap, Casting Couch Issue, Diretcor, Negative Trolls, Old Tweet About Casting Couch, Payal Ghosh, Payal Ghosh Facing Negative Trolls In Social Media

తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన “ఊసరవెల్లి” చిత్రంలో హీరోయిన్ తమన్న స్నేహితురాలి పాత్రలో నటించి ప్రేక్షకులని బాగానే అలరించిన బాలీవుడ్ బ్యూటీ పాయల్ ఘోష్ ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది.అయితే ఇటీవలే పాయల్ ఘోష్ ఓ సినిమా అవకాశం విషయమై బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ని కలిసేందుకు వెళ్లగా అతడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించడమేగాకుండా నీలి చిత్రాలను చూపించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆరోపణలు చేసింది.

TeluguStop.com - Payal Ghosh Facing Negative Trolls In Social Media

దీంతో మొదట్లో పాయల్ ఘోష్ కి కొంత మంది సినీ సెలబ్రిటీలు మరియు నెటిజన్లు మద్దతు లభించినప్పటికీ ఆమె తనపై లైంగిక వేధింపులు జరిగినట్లు సరైన ఆధారాలు చూపకపోవడంతో   సోషల్ మీడియా మాధ్యమాలలో  నెగటివ్ ట్రోల్స్ మొదలయ్యాయి.

దీనికితోడు ఈ మధ్య దర్శకుడు అనురాగ్ కశ్యప్ కి బాలీవుడ్ సినిమా పరిశ్రమలోని పలువురు సినీ సెలబ్రిటీలు తమ మద్దతును తెలియజేయడంతో పాటు అనురాగ్ కశ్యప్ పై నటి పాయల్ ఘోష్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఖండిస్తున్నారు.

TeluguStop.com - ఎప్పుడో చేసిన పనికి పాయల్ పాపని నెట్టింట్లో ఆడుకుంటున్నారుగా….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే గతంలో  నటి పాయల్ ఘోష్  క్యాస్టింగ్ కౌచ్ విషయంలో చేసినటువంటి ఓ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.అయితే ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందంటే సినిమా పరిశ్రమలో ఎవరూ బలవంతంగా బలాత్కారం చేయరని తమకు అలాంటి కమిట్మెంట్ కావాలని అడుగుతారని ఒకవేళ మీకు కమిట్మెంట్ ఇవ్వడం ఇష్టం లేకపోతే సింపుల్ గా నో చెప్పవచ్చని అంతే తప్ప డ్రామా చేయాల్సిన అవసరం లేదంటూ ట్వీట్ లో పేర్కొంది.

దీంతో కొందరు నెటిజన్లు ఎప్పుడో రెండేళ్ల క్రితం పాయల్ ఘోష్ చేసినటువంటి  ట్వీట్ ని వెతికి మరీ ఆమె గురించి సోషల్ మీడియా మాధ్యమాలలో నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు అంతే గాక అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ గురించి అంత క్లాస్ పీకిన  పాయల్ ఘోష్ ప్రస్తుతం ఈ కాస్టింగ్ కౌచ్  సమస్య తనకి ఎదురయ్యేసరికి సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తుందని కామెంట్ చేస్తున్నారు.

మరికొందరైతే ఏకంగా నటి పాయల్ ఘోష్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై చేస్తున్నలైంగిక వేధింపుల ఆరోపణలని నిరూపించేందుకు తగిన ఆధారాలు ఆమె వద్ద లేవని అందువలనే సోషల్ మీడియా మాధ్యమాలలో కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తుందని ఒకవేళ ఆమె వద్ద తగిన ఆధారాలు ఉంటే పోలీసులను సంప్రదించి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

#PayalGhosh #Payal Ghosh #Diretcor #CastingCouch #Anurag Kashyap

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Payal Ghosh Facing Negative Trolls In Social Media Related Telugu News,Photos/Pics,Images..