సినిమా సినిమా కి రేంజ్ పెంచుతున్న RX100 బ్యూటీ

RX100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.ఆ చిత్రంలో ఆమె అందాల ఆరబోత, లిప్ లాక్స్ తోనే ఆ చిత్రం ఒక మంచి హిట్ ని పొందింది.

 సినిమా సినిమా కి రేంజ్ పెంచుత-TeluguStop.com

అయితే ఈ చిత్రానికి పాపం పాయల్ 3 లక్షల పారితోషికం మాత్రమే తీసుకుంది.మొదటి చిత్రం కావడం తో ఓ రేంజ్ లో అందాలు ఆరబోసినా, ఈ అమ్మడికి అంత మొత్తమే ముట్టింది.

కానీ ఈ చిత్రం హిట్ అవ్వడం తో ఇప్పుడు ఈ అమ్మడి రేంజ్ మారిపోయిందట.

తన రెండో సినిమా కి ఈ అమ్మడు ఏకంగా 40-45 లక్షలు డిమాండ్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్.

అయితే రెండో చిత్రం రిలీజ్ కాకుండానే ఈ అమ్మడు ప్రస్తుతం మూడో చిత్రం కోసం రెండో చిత్రం కంటే డబుల్ పారితోషికం డిమాండ్ చేసిందట.

దీనితో నిర్మాతలకు కళ్లు సైతం బైర్లు కమ్మాయట.

విక్టరీ వెంకటేష్ – నాగచైతన్య కథానాయకులుగా నటిస్తున్న `వెంకీ మామ` చిత్రంలో ఓ కథానాయికగా నటిస్తున్న పాయల్ కి 45 లక్షల పారితోషికం ముడుతోందట.అయితే ‘వెంకీ మామ’ రిలీజ్ కాకుండానే నటసింహా నందమూరి బాలయ్య- కె.ఎస్.రవికుమార్ ల కాంబినేషన్ లో వస్తున్న మూవీలో అమ్మడికి ఆఫర్ ఇస్తే, ఏకంగా 75లక్షల పారితోషికం డిమాండ్ చేయడం తో షాక్ తిన్న నిర్మాతలు వేరొక భామ కోసం వెతుకుతున్నారని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube