సినిమా సినిమా కి రేంజ్ పెంచుతున్న RX100 బ్యూటీ  

సినిమా సినిమా కి రేంజ్ పెంచుతున్న Rx100 బ్యూటీ-nagachaitanya,payal,rx100,venkatesh,పాయల్ రాజ్ పుత్

RX100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ చిత్రంలో ఆమె అందాల ఆరబోత, లిప్ లాక్స్ తోనే ఆ చిత్రం ఒక మంచి హిట్ ని పొందింది. అయితే ఈ చిత్రానికి పాపం పాయల్ 3 లక్షల పారితోషికం మాత్రమే తీసుకుంది. మొదటి చిత్రం కావడం తో ఓ రేంజ్ లో అందాలు ఆరబోసినా, ఈ అమ్మడికి అంత మొత్తమే ముట్టింది. కానీ ఈ చిత్రం హిట్ అవ్వడం తో ఇప్పుడు ఈ అమ్మడి రేంజ్ మారిపోయిందట..

సినిమా సినిమా కి రేంజ్ పెంచుతున్న RX100 బ్యూటీ -Payal Demanding More Remuneration

తన రెండో సినిమా కి ఈ అమ్మడు ఏకంగా 40-45 లక్షలు డిమాండ్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్. అయితే రెండో చిత్రం రిలీజ్ కాకుండానే ఈ అమ్మడు ప్రస్తుతం మూడో చిత్రం కోసం రెండో చిత్రం కంటే డబుల్ పారితోషికం డిమాండ్ చేసిందట.

దీనితో నిర్మాతలకు కళ్లు సైతం బైర్లు కమ్మాయట. విక్టరీ వెంకటేష్ – నాగచైతన్య కథానాయకులుగా నటిస్తున్న `వెంకీ మామ` చిత్రంలో ఓ కథానాయికగా నటిస్తున్న పాయల్ కి 45 లక్షల పారితోషికం ముడుతోందట. అయితే ‘వెంకీ మామ’ రిలీజ్ కాకుండానే నటసింహా నందమూరి బాలయ్య- కె.ఎస్.

రవికుమార్ ల కాంబినేషన్ లో వస్తున్న మూవీలో అమ్మడికి ఆఫర్ ఇస్తే, ఏకంగా 75లక్షల పారితోషికం డిమాండ్ చేయడం తో షాక్ తిన్న నిర్మాతలు వేరొక భామ కోసం వెతుకుతున్నారని తెలుస్తోంది.