పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు.ఈయన కుమారుడు అకిరా వెండితెరపై ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అకిరా కు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది.కాబోయే మెగా హీరోగా ఈయనను ఫ్యాన్స్ స్పెషల్ గా ట్రీట్ చేస్తూ ఉంటారు.
అకిరా యాక్టింగ్ మాత్రమే కాదు కరాటే, సంగీతం కూడా నేర్చుకుంటున్నాడు.ఇది వరకు పవన్ కళ్యాణ్ స్వయంగా కుమారుడిని మ్యూజిక్ క్లాసులకు సైతం తీసుకు వెళ్లిన ఫోటోలు బయటకు వచ్చాయి.
తాజాగా అకిరా టాలెంట్ ఉన్న కీబోర్డ్ ప్లేయర్ అని నిరూపించుకున్నాడు.అకిరా కీబోర్డ్ ప్లే చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త నెట్టింట వైరల్ అయ్యింది.
ఈయన మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్ ను ప్లే చేస్తూ కనిపించాడు.మెగా వారసుడు ట్యూన్ ప్లే చేసిన విధానాన్ని బట్టి అతడి స్కిల్స్ అర్ధం అవుతున్నాయి.
ఈయన టాలెంట్ చూసి మీద అభిమానులు ఫిదా అవుతున్నారు.మరోవైపు సూపర్ స్టార్ సాంగ్ ను పవర్ స్టార్ వారసుడు ప్లె చేయడం పై మహెష్ బాబు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఇక పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా ఇప్పటికే ఈయన సిల్వర్ స్క్రీన్ మీద తల్లి రేణు దేశాయ్ డైరెక్ట్ చేసిన ఇష్క్ వాలా లవ్ అనే సినిమాలో కీలక పాత్రలో నటించాడు.ఇది ఒక మరాఠి సినిమా.ప్రెసెంట్ సినిమాల విషయం పక్కన పెట్టి చదువు పైనే శ్రద్ధ పెట్టాడు.
మార్ తర్వాత ఈయన నటన వైపు అడుగులు వేస్తాడో లేదంటే ఇంకేదైనా చేస్తాడో చూడాలి.