జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రెండో దశ వారాహి యాత్ర ఏలూరు నియోజకవర్గంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఆదివారం నాడు ఏలూరులో( Eluru ) జరిగిన బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి జగన్ పై ( CM Jagan ) పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
వాలంటీర్ల వ్యవస్థ గురించి చేసిన వ్యాఖ్యలు పెను దుమారని రేపుతున్నాయి.ఇక ఇదే బహిరంగ సభలో ఏలూరులో డిగ్రీ ప్రభుత్వ కళాశాలకి భవనం లేదని వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే శనివారం ట్విట్టర్ లో చదువులకు సంబంధించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ సంచలన ట్వీట్ చేశారు.”చెట్ల కింద చదువులు చూడాలంటే ఎక్కడో మారుమూల పల్లెలకు వెళ్ళనవసరం లేదు.జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో ఉన్న ప్రభుత్వ కళాశాలకు వెళ్తే చాలు.పథకాలకు పేర్లు పెట్టుకోవడం మీద ఉన్న శ్రధ్ధ కాలేజీకి భవనం నిర్మించడంపై పెట్టాలి.300మంది చదువుతున్న ఈ కాలేజీకి బటన్ నొక్కి బిల్డింగ్ కట్టించు జగన్” అని ఫోటోలు పోస్ట్ చేయడం జరిగింది.పవన్ లేటెస్ట్ ఈ ట్వీట్ వైరల్ గా మారింది.