జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న వారాహి విజయయాత్ర అట్టర్ ప్లాప్ అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.కాపులు అధికంగా ఉండే ప్రాంతాల్లో పవన్ సభలు పెడుతున్నారన్నారు.
చంద్రబాబుతో కలిసి వస్తున్నానని చెప్పగానే యాత్ర ప్లాప్ అయిందని మంత్రి అంబటి ఎద్దేవా చేశారు.పవన్ సభకు వెళ్లండి అని లోకేశ్ ట్వీట్ చేశారన్న అంబటి పవన్ బీజేపీతో ఉన్నానని అంటారన్నారు.
మళ్లీ టీడీపీతోనూ వెళ్తానంటారని విమర్శించారు.పవన్ కల్యాణ్ కు నైతికత లేదని మండిపడ్డారు.
పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరారని చెప్పారు.చంద్రబాబు అవినీతి డబ్బుతో జనసేన నడుస్తోందన్నారు.
భూస్థాపితమవుతున్న టీడీపీని బతికించాలనే పవన్ తాపత్రయమని పేర్కొన్నారు.అయితే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, లోకేశ్, పవన్ ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు.