చిరంజీవికి నో ఎంట్రీ బోర్డు పెట్టేసిన జనసేనాని! మెగా హీరోలకి మాత్రం ఎంట్రీ

ఏపీ రాజకీయాలలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో చరిష్మాని సొంతం చేసుకొని రాజకీయాలలో కొంత కాలం పాటు క్రియాశీలకంగా ఉండి ఎన్నికల తర్వాత తప్పని పరిస్థితిలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా పని చేసిన నాయకుడు మెగాస్టార్ చిరంజీవి.ఇక అప్పటి పరిస్థితుల ప్రభావం వలన పార్టీని నడిపే సామర్ధ్యం లేకపోవడం ఇష్టం లేకపోయిన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ప్రజలని మోసం చేసిన వ్యక్తిగా చిరంజీవి తనపై ముద్ర వేసుకున్నాడు.

 Pawankalyan Says Chiranjeevi Not Again Entry In Politics-TeluguStop.com

అయితే ప్రజారాజ్యం పతనం వెనుక చాలా శక్తులు వెనకుండి పనిచేసాయనేది రాజకీయ వర్గాలలో చాలా మంది విశ్వసించే మాట.

ఇక ప్రజారాజ్యం వైఫల్యాల నుంచి బయటకి వచ్చి ఏపీ రాజకీయాలలో తనదైన దూసుకుతో దూసుకొచ్చిన నేతగా, చిరంజీవి సోదరుడుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన సత్తా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.అయితే పవన్ కళ్యాణ్ మీద చేయడానికి అవినీతి ఆరోపణలు ఏమీ లేకపోయే సరికి ప్రజారాజ్యం పార్టీని ఎత్తి చూపిస్తూ ప్రత్యర్ధి పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి.అదే సమయంలో వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారు.

మరో వైపు ఎన్నికలు దగ్గరపడటంతో ఏపీలో జనసేన పభావం బలంగా ఉండటంతో పవన్ కళ్యాణ్ ని ఎలా అయిన నిలువరించాలని ప్రత్యర్ధి పార్టీలు కుట్రలకి తెరతీస్తున్నాయి.

తాజాగా మరో సారి ప్రత్యర్ధి పార్టీలు జనసేనని టార్గెట్ చేస్తూ అన్న దారిలోనే తమ్ముడు కూడా నడుస్తున్నాడని విమర్శలు చేస్తున్నారు.తాజాగా మీడియా సమావేశంలో చిరంజీవి మళ్ళీ జనసేన పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నలకి పవన్ కళ్యాణ్ తనదైన సమాధానం చెప్పారు.చిరంజీవి వ్యక్తిత్వం చాలా సాఫ్ట్ అని, ఈ కారణంగా అతను మళ్ళీ రాజకీయాలలోకి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసాడు.

రాజ‌కీయాల‌ను తాను చూసే కోణం వేరు.చిరంజీవి చూసే కోణం వేర‌ని చెప్పాడు జ‌న‌సేనాని.ఇవ‌న్నీ విన్న త‌ర్వాత ఇప్పుడే కాదు దీంతో చిరంజీవికి జనసేనలో స్థానం లేదని పవన్ స్పష్టం చేసినట్లు అయ్యింది.అయితే ఇతర మెగా హీరోలు మాత్రం జనసేన పార్టీ కోసం ఎన్నికల ప్రచారంలోకి రావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube