'పాదయాత్ర'కు పవన్ రెడీ అవుతున్నారా ?  

Pawan Kalyan Padayatra Will Starts Soon-cm Ys Jagan,janasena,padayatra,pawan Kalyan,pawan Kalyan Janasena,ys Jagan,ysrcp

జనసేన పార్టీ రాజకీయంగా ఎత్తు పల్లాలను చూస్తోంది.ఆ పార్టీ అధినేత పవన్ కు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, సామజిక వర్గం అండదండలు పుష్కలంగా ఉన్నా ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటుకే పరిమితం అయిపోయింది జనసేన పార్టీ.పవన్ రాజకీయాల్లో అడుగుపెట్టినప్పుడే ఏపీ లో అనేక సంచలనాలు చోటు చేసుకుంటాయని అధికారం చేపట్టే అంత స్థాయిలో కాకపోయినా ఎవరు అధికారంలోకి రావాలన్నా తమ మద్దతు కీలకం అవుతుందని పవన్ భావించారు...

Pawan Kalyan Padayatra Will Starts Soon-cm Ys Jagan,janasena,padayatra,pawan Kalyan,pawan Kalyan Janasena,ys Jagan,ysrcp-Pawan Kalyan Padayatra Will Starts Soon-Cm Ys Jagan Janasena Padayatra Pawan Janasena Ys Ysrcp

అయితే ఫలితాలు మాత్రం అందుకు విరుద్ధంగా వచ్చాయి.కానీ ఫలితాల తరువాత పవన్ ఎక్కడా వెనక్కి తగ్గినట్టు కనిపించడంలేదు.ఇప్పుడు చేదు ఫలితాలు వచ్చినా ముందు ముందు జనసేనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్న ఉద్దేశంతో పవన్ పార్టీకి మరింత మైలేజ్ తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాడు.

వచ్చే ఎన్నికల సమయం వరకు నిత్యం ప్రజల్లోనే తిరుగుతూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని చూస్తున్నాడు.

Pawan Kalyan Padayatra Will Starts Soon-cm Ys Jagan,janasena,padayatra,pawan Kalyan,pawan Kalyan Janasena,ys Jagan,ysrcp-Pawan Kalyan Padayatra Will Starts Soon-Cm Ys Jagan Janasena Padayatra Pawan Janasena Ys Ysrcp

పాదయాత్ర చేసిన నాయకులు తప్పకుండా అధికారంలోకి వస్తారనే సెంటిమెంట్ ఏపీ రాజకీయాల్లో బలంగా ఉంది.వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, జగన్ ఇలా అందరూ అధికారానికి దూరంలోగా ఉన్నప్పుడు కాళ్ల పనిచెప్పి రాష్ట్రమంతా తిరిగారు.ఆ తరువాత అధికారంలోకి వచ్చారు...

ఇప్పుడు అదే తరహాలో పాదయాత్ర చేపట్టి ఏపీలోని అన్ని వర్గాలకు చేరువ అవ్వాలని జనసేన అధినేత భావిస్తున్నాడు.

దాదాపు 18 నెలల పాటు 134 నియోజకవర్గాల్లో 3,600 కిలోమీటర్లు జగన్ పాదయాత్ర చేశారు.ఈ పర్యటనతో నియోజకర్గాల వారిగా పార్టీ నేతలతో ముఖాముఖీలను ఏర్పాటు చేసుకుంటూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి జగన్ ఎంతగానో శ్రమించారు.అది ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది.ఆ విధంగానే తానూ పాదయాత్ర చేస్తే బాగుంటుందనే ఆలోచనకు పవన్ వచ్చినట్లు సమాచారం...