హమ్మయ్య.. పవన్‌ దీక్ష ముగిసింది, పాత లుక్‌ లోకి వచ్చేశాడు  

Pawan will join vakeel saab shooting next month Pawan kalyan, Vakeel Saab, Movie Shooting, November, Elections, Pawan New look, Pawan Deeksha, - Telugu Harish Shankar, Krish, Pawan Kalyan, Telugu Film News, Tollywood News, Vakeel Sab

గత మూడు నాలుగు నెలలుగా పవన్‌ గుబురు గడ్డం మరియు పొడవాటి జుట్టుతో కనిపిస్తున్నాడు.పవన్‌ ను ఆ లుక్‌ లో అభిమానులు చూడలేక పోతున్నారు.

TeluguStop.com - Pawan Will Join Shooting Vakeel Saab Next Month

ఇక యాంటీ ఫ్యాన్స్‌ పవన్‌ ను ఏ స్థాయిలో ట్రోల్స్‌ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తెలుగు సినిమాల్లో స్టార్‌ హీరోగా వెలుగు వెలుగుతున్న పవన్‌ కళ్యాణ్‌ ఇలాంటి లుక్‌ లో ఉండటం ఏంటీ అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పవన్‌ దీక్ష చేస్తున్న కారణంగా ఆయన జుట్టు మరియు గడ్డం అలా పెంచుతూ వచ్చాడు.ఎట్టకేలకు దసరా సందర్బంగా పవన్‌ దీక్షను విరమించాడు.

TeluguStop.com - హమ్మయ్య.. పవన్‌ దీక్ష ముగిసింది, పాత లుక్‌ లోకి వచ్చేశాడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీక్ష విరమించిన నేపథ్యంలో పవన్‌ తన పాత లుక్‌ లోకి వచ్చాడు.పవన్‌ కాస్త బరువు తగ్గడంతో పాటు పాత లుక్‌లోకి రావడంతో ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ దీక్ష విరమించడంతో పాటు నవంబర్‌ 1 నుండి వకీల్‌ సాబ్‌ చిత్రం షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే సగానికి పైగా వకీల్‌ సాబ్‌ షూటింగ్‌ పూర్తి అయ్యింది.

పవన్‌ షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలోనే లాక్‌డౌన్‌ వచ్చింది.ఆ కారణంగా ఏడు నెలలుగా షూటింగ్‌ నిలిచి పోయింది.

మళ్లీ ఏడు నెలల తర్వాత పవన్‌ షూటింగ్‌కు రెడీ అయ్యాడు.వచ్చే నెల మొదలు పెట్టబోతున్న సినిమాలు వరుసగా చేయబోతున్నాడు.

నవంబర్ చివరి వరకు వకీల్‌ సాబ్‌ను పూర్తి చేయబోతున్నాడు.ఆ తర్వాత క్రిష్‌ దర్శకత్వంలో సినిమాను డిసెంబర్‌ నుండి మొదలు పెట్టబోతున్నాడు.

వచ్చే ఏడాదిలో పవన్‌ మొత్తం నాలుగు అయిదు సినిమాలు చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నాడు.ఆ సినిమాలు అన్ని కూడా వచ్చే ఏడాదిలోనే విడుదల అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

రాబోయే ఎన్నికల వరకు పవన్‌ కనీసం 10 సినిమాలు అయినా చేయాలనే టార్గెట్‌ తో ఉన్నాడు.

#Harish Shankar #Vakeel Sab #Krish #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pawan Will Join Shooting Vakeel Saab Next Month Related Telugu News,Photos/Pics,Images..