ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఒక సామాజిక వర్గం చేతిలో ఉంటుందని తెలిసిందే.ఇప్పుడున్న టీడీపీ, వైసీపీ పార్టీలను చూస్తేనే ఆ విషయం క్లారిటీగా అర్థం అయిపోతుంది.
ఇక కొత్తగా పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ తన సామాజిక వర్గం అయిన కాపుల సమస్యల గురించి పెద్దగా స్పందించలేదు.ఎందుకంటే తనపై కాపు ముద్ర పడితే రాజకీయంగా ఎదగలేమనే భావనతోనే ఆయన వారి సమస్యలను పక్కనపెట్టేశారు.
కానీ రాజకీయంగా ఆయన ఇప్పుడు కూడా ఎదగకపోవడంతో ఇప్పుడు ఆ జెండా ఎత్తుకున్నట్టు తెలుస్తోంది.
పవన్ మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో ఉండడంతో తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్కు పవన్ ముఖ్య అతిథిగా వెళ్లారు.
ఆ వేడుకలో ఆయన సినిమా విషయాల కంటే ఎక్కువగా రాజకీయ అంశాలే ప్రస్తావించారు.అందులో భాగంగానే కాపు రిజర్వేషన్ల విషయం తేవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.మీడియా ప్రజల తరపున నిలవాలని ఆయన మాట్లాడుతూ.ఏపీలో గతంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కాపు రిజర్వేషన్ల గురించి ప్రశ్నించింది.
కానీ ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆ విషయాన్ని మర్చిపోయిందని దానిపై మీడియాలో కథనాలు చేసుకోవాలని పరోక్షంగా సీఎం జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఏపీలో ఇప్పుడు టీపీడీ, వైసీపీ పార్టీల్లాగే తన జనసేన పార్టీని కూడా కాపు సామాజిక వర్గం అండతోనే ముందుకు తీసుకెళ్లాలని జనసేన అధినేత భావిస్తున్నట్టు తెలుస్తోంది.ఎందుకంటే ఇప్పుడు ఏపీలో కాపు సామాజికవర్గం ఓటర్లే ఎక్కువగా ఉండటం ఆయనకు కలిసివచ్చే అంశం.దీంతో తాను ఆ సామాజికవర్గాన్ని ఓన్ చేసుకుంటే వారి అండతో మరింత బలపడొచ్చని అనుకుంటున్నారంట.అందుకే ఆయన మొన్న రిపబ్లిక్ మూవీ ఆడియో ఫంక్షన్‌కు వచ్చినప్పుడు కాపు రిజర్వేషన్లపై జగన్‌ను ప్రశ్నించారు.
ఇక వచ్చే ఎన్నికల్లో పవన్ ఈ అంశాన్ని బేస్ చేసుకుని రాజకీయాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.