ఆ విష‌యంలో జ‌గ‌న్ కంటే ప‌వ‌న్ కే మ‌ద్ద‌తు..

ఇప్పుడు కొత్త పంచాయితీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ తెర లేపారు.మొన్న ఆయ‌న రిప‌బ్లిక్ మూవీ ఆడియో ఫంక్ష‌న్‌లో లో సినీ ఇండ‌స్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై అలాగే ఎగ్జిబిటర్ల ఇబ్బందుల మీద మాట్లాడిన సంగ‌తి తెలిసిందే.

 Pawan Who Targeted That Social Group Did Panta Change-TeluguStop.com

ఈ విష‌యంలో ఎక్కువ‌గా ఆయ‌న జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు.మొద‌టిసారి ఆయ‌న ఇలా సినీ ఇండ‌స్ట్రీ ఇబ్బందుల‌పై స్పందించ‌న సంగ‌తి తెల‌సిందే.

ఇక అప్ప‌టి నుంచి సినీ ఇండ‌స్ట్రీ మ‌ద్ద‌తు ప‌వ‌న్‌కు ల‌భిస్తుందా లేదంటే జ‌గ‌న్‌కు ల‌భిస్తుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

 Pawan Who Targeted That Social Group Did Panta Change-ఆ విష‌యంలో జ‌గ‌న్ కంటే ప‌వ‌న్ కే మ‌ద్ద‌తు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే పవన్ వెనుక సినీ ఇండ‌స్ట్రీకి చెందిన కొన్ని పెద్ద శక్తులు ఉన్నాయని వాటి అండ‌తోనే ఆయ‌న ఇలా ముందుకు వ‌చ్చార‌నే గుసగుసలు కూడా బాగానే వినిపిస్తున్నాయి.

అయితే ఇప్పుడు ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై కూడా వైసీపీ మంత్రులు విమ‌ర్శ‌ల అటాక్ మొద‌లు పెట్టారు.ఎక్క‌డ సినీ ఇండ‌స్ట్రీ నుంచి త‌మ‌కు వ్య‌తిరేక‌త వ‌స్తుందో అనే భ‌యంతో ప‌వ‌న్‌పై త‌మ‌కు అనుకూలంగా ఉండే మ‌రికొంద‌రు సినీ పెద్ద‌ల‌తో కౌంట‌ర్ వేయించేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక ఆడియో ఫంక్ష‌న్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరో నానికి ఎదురైన స‌మ‌స్య‌ల‌ను కూడా ప్ర‌స్తావించిన సంగతి తెలిసిందే.

Telugu Ap News, Ap Politics, Cinema Industry, Jagan, Janasena, Nani, Pawan, Pawan Kalyan Republic Pre Release Event, Ycp Govt-Telugu Political News

ఇక దీంతో నేచురల్ స్టార్ నాని ప‌వ‌న్‌కు త‌న మ‌ద్ద‌తు తెలిపేశాడు.చాలామంది ఇప్పుడు ప‌వ‌న్‌కు అండ‌గా నిలుస్తూ ట్వీట్లు కూడా చేస్తున్నారు.ప‌వ‌న్ లాంటి వ్య‌క్తి ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల‌ను భుజాన వేస‌కుంటాన‌ని చెప్ప‌డంతో అంద‌రూ ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ప‌లికేందుకు ముందుకు వ‌స్తున్నారు.

ఇక మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ తో పాటుగా విజ‌య్ దేవ‌ర కొండ లాంటి స్టార్ హీరోలు కూడా ముందుకు వ‌చ్చి ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరుతున్నారు చిన్న హీరోలు.జ‌గ‌న్ థియేట‌ర్ల‌ను తెర‌వ‌కుండా టికెట్ల‌ను అమ్ముకోవ‌డంతో ప‌రివ్ర‌మ ఇబ్బందులు ప‌డుతోంద‌నే స‌మ‌స్య‌ల‌పై ప‌వ‌న్ నోరు విప్ప‌డం ఆయ‌న‌కు బాగానే క‌లిసి వ‌స్తోంద‌ని చెప్పాలి.

.

#Nani #Janasena #Pawan #PawanKalyan #YCP

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు