వైసీపీ మీద అలాంటి కామెంట్లు చేసిన ప‌వ‌న్‌.. త‌ల‌లు ప‌ట్టుకుంటున్న జ‌న‌సైనికులు

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎప్పుడూ ఒక‌మాట మీద నిల‌బ‌డ‌కుండా ఉండ‌టం ఆయ‌న పార్టీకే కాదు ఆయ‌న వ్య‌క్తిగ‌త ఇమేజ్‌కు కూడా చాలా ప్ర‌మాద‌క‌రంగా మారుతోంది.గ‌తంలో కూడా ఇలాగే టీడీపీకి మ‌ద్ద‌తు ఇచ్చి వ్య‌క్తిగ‌త ఇమేజ్‌ను దెబ్బ తీసుకున్నారు.

 Pawan Who Have Made Such Comments On Ycp Soldiers Holding Heads , Ycp, Pawan-TeluguStop.com

ఆ త‌ర్వాత క‌మ్యూనిస్టుల‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేసి ఓడిపోయారు.అయితే అలాగే కంటిన్యూ అయినా బాగుండేది కానీ ఆ త‌ర్వాత వారి పొత్తు వీడి మ‌ళ్లీ బీజేపీతో చేతులు క‌లిపారు.

దీంతో అస‌లు ప‌వ‌న్‌కు ఒక సిద్ధాంతం అనేది ఉందా అనే అనుమానాలు ప్ర‌జ‌ల్లో క‌లుగుతున్నాయి.ఎప్పుడు ఏ పార్టీతో క‌లుస్తారో ఎవ‌రికీ తెలియ‌దంటూ వాపోతున్నారు.

త‌న‌ది లెఫ్ట్ ఇజం అని చెప్పే ప‌వ‌న్ రైటిజం ఉన్న బీజేపీతో ఎలా క‌లుస్తారంటూ ఇప్ప‌టికీ ప్ర‌శ్నిస్తూనే ఉన్నారు.ఇక‌పోతే ఇప్పుడు బీజేపీతో చాలా రోజులుగా క‌లిసి ఉంటున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ వైసీపీ మీద ఒంటి కాలుతో లేస్తున్నార‌.

రీసెంట్ గా ఇరు పార్టీల‌కు న‌డుమ ఎంతా దుమారం రేగుతుందో చూస్తూనే ఉన్నాం.ఇలాంటి త‌రుణంలో ఆయ‌న వైసీపీ మీద ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు.రీసెంట్ గా తెలంగాణ జ‌న‌సేన క‌మిటీల‌తో స‌మావేశం అయిన ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలంగాణ యాసను తాను గౌరవిస్తున్నట్టు చెప్పారు.అయితే కులాలను రెచ్చగొట్టడం అనేది త‌న నైజం కాద‌ని చెప్పారు.

Telugu Pawan, Pawanycp-Telugu Political News

అదేంటి మొన్న‌టికి మొన్న జ‌గ‌న్ సామాజిక వ‌ర్గం మీద అంత పెద్ద ఎత్తున కామెంట్లు చేసిన ప‌వ‌న్ మ‌ళ్లీ కులాల‌ను రెచ్చ‌గొట్ట‌డం త‌న ఉద్ధేశం కాదని ఎలాచెబుతారంటూ మండిప‌డుతున్నారు.ఇక అంతే కాదు వైసీపీ కూడా తనకు శత్రువు కాద‌ని అందులోని నేత‌లు కూడా త‌న ఎలాంటి శ‌త్రువులు కాదంటూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు.వైసీపీ మీద ఈ మ‌ధ్య ఒంటికాలితో లేస్తున్న వ‌ప‌న్‌ను చూసుకుని తాము కూడా ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్న జ‌న‌సైనికులు ఈ వ్యాఖ్య‌ల‌తో త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.అస‌లు ప‌వ‌న్‌ను ఎవ‌రిని విమ‌ర్శిస్తున్నారో ఎందుకు మ‌ళ్లీ పొగుడుతున్నారో అర్థం కావ‌ట్లేద‌ని వాపోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube