దేవుడు కనిపించి వరమడిగితే పవన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా: బండ్ల గణేష్

బండ్ల గణేష్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.పలు సినిమాల్లో నటుడిగా నటిస్తూనే నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు.

 Pawan Wants To Be Chief Minister If God Appears By Bandla Ganesh, Bandla Ganesh, Tollywood, Chief Minister, Pawan Kalyan-TeluguStop.com

ఈ విధంగా ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్న బండ్లగణేష్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే సంగతి మనకు తెలిసిందే.ఇకపోతే ఇన్నిరోజులు నటుడిగా పలు సినిమాలలో నటించిన బండ్ల గణేష్ డేగల బాబ్జి సినిమా ద్వారా హీరోగా సందడి చేయనున్నారు.

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 Pawan Wants To Be Chief Minister If God Appears By Bandla Ganesh, Bandla Ganesh, Tollywood, Chief Minister, Pawan Kalyan-దేవుడు కనిపించి వరమడిగితే పవన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా: బండ్ల గణేష్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమానికి చిత్ర బృందం హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి బండ్ల గణేష్ తో పాటు దర్శకుడు వెంకట్ చంద్ర, నటుడు సమీర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సుమ వారిపై పంచులు వేయడం వారు కూడా సుమకు పంచ్ లు వేస్తూ సందడి చేశారు.

Telugu Bandla Ganesh, Pawan Kalyan, Tollywood-Movie

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా బండ్ల గణేష్ ను ప్రశ్నిస్తూ మీకు కనుక దేవుడు ప్రత్యక్షమై వరం కావాలంటే మీ గురించి అడుగుతారా.పవన్ కళ్యాణ్ గురించి కోరుకుంటారా అని ప్రశ్నించగా తాను పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని ఆ తర్వాత నేను కూడా బాగుండాలని కోరుకుంటాను అంటూ బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు.అదేవిధంగా కరోనా సమయంలో తనకు మెగాస్టార్ చిరంజీవి చేసిన సహాయాన్ని కూడా ఈ కార్యక్రమంలో బండ్లగణేష్ తెలియజేశారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube