పవన్‌ ఫాలోయింగ్‌తో నా జన్మ ధన్యమైందంటున్న థమన్‌

సౌత్‌ ఇండియాలోనే స్టార్‌ హీరో అయిన పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ట్విట్టర్‌లో భారీగా ఫాలోయింగ్‌ను కలిగి ఉన్న విషయం తెల్సిందే.ఆయన ఫాలోయింగ్‌ ముందు ఇతర హీరోలు కూడా చిన్నబోవాల్సిందే.

ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉండే పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటి వరకు 33 మందిని ఆయన ఫాలో అవుతున్నాడు.ఆ 33 మంది కూడా అత్యంత ప్రముఖులు.

తాజాగా ఆ జాబితాలో థమన్‌ చేరాడు.థమన్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ను పవన్‌ కళ్యాణ్‌ ఫాలో అవుతున్నాడు.

కొత్తగా పవన్‌ థమన్‌ను ఫాలో అవుతున్న నేపథ్యంలో థమన్‌ తన సంతోషాన్ని పంచుకున్నాడు.

ట్విట్టర్‌లో థమన్‌ తన ఆనందానికి అవదులు లేవు అంటూ పేర్కొన్నాడు.

నేను ఎంతగానో అభిమానించే పవన్‌ కళ్యాణ్‌ నన్ను ట్విట్టర్‌లో ఫాలో అవ్వడంతో నా జన్మధన్యం అయినంతగా సంతోషంగా ఉందని ఈ సందర్బంగా థమన్‌ పేర్కొన్నాడు.ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న వకీల్‌ సాబ్‌కు థమన్‌ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెల్సిందే.

ఆ కారణంగానే థమన్‌ను పవన్‌ ఫాలో అయ్యి ఉండవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Pawan Kalyan, Ss Thaman, Vakeel Saab-Movie

ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాకుండా సౌత్‌లో చాలా లీడ్‌లో ఉన్న సంగీత దర్శకుడు థమన్‌.ఈయన ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సౌత్‌ కంపోజర్‌గా నిలిచాడు.ఈయన అల వైకుంఠపురంలో చిత్రానికి ఇచ్చిన సంగీతం ఇంకా కూడా మారుమ్రోగుతూనే ఉంది.

అద్బుతం అమోఘం అంటూ విమర్శకులు కూడా ఆ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు.ప్రస్తుతం ఈయన స్టార్‌ హీరోల సినిమాలకు కంపోజ్‌ చేస్తున్నాడు.పవన్‌ ఈయన్ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నాడు అంటే ఏ స్థాయిలో ఆయన క్రేజ్‌ పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube