ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ మూవీ స్టోరీ

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ – ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కాంబినేష‌న్‌లో సినిమా అంటే అంచ‌నాలు ఎంత తారాస్థాయిలో ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.గ‌తంలో వీరి కాంబోలో వ‌చ్చిన జ‌ల్సా, అత్తారింటికి దారేది సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి.

 Pawan-trivikram Movie Storyline-TeluguStop.com

అత్తారింటికి దారేది సినిమా అయితే అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఇండ‌స్ట్రీ రికార్డుల‌ను తిర‌గ‌రాసి స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

అత్తారింటికి దారేది ప‌వ‌న్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది.

ముచ్చ‌ట‌గా మూడోసారి వీరి కాంబోలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై ఏ చిన్న వార్త లీక్ అయినా ఇండ‌స్ట్రీ మొత్తం జోరుగా ట్రెండ్ అవుతోంది.ఈ సినిమా టైటిల్ ద‌గ్గ‌ర నుంచి, స్టోరీ లైన్ నుంచి ఏ చిన్న వార్త లీక్ అయినా పెద్ద సెన్షేష‌న‌ల్ అవుతోంది.

ఇక ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో విన‌ప‌డుతోన్న టాక్ ప్ర‌కారం ఈ సినిమా స్టోరీ లైన్ అంటూ ఓ లైన్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.క‌థానుసారంగా ఈ సినిమాలో ప‌వ‌న్ తండ్రికి ఇద్ద‌రు భార్య‌లు ఉంటార‌ట‌.

వీరిలో ప‌వ‌న్ రెండో భార్య కుమారుడు.ప‌వ‌న్ తండ్రి మొద‌టి భార్య సంతానం ప‌వ‌న్ త‌ల్లితో పాటు ప‌వ‌న్‌ను దూరంగా నెట్టేస్తారు.

స‌మాజంలో ఎన్నో ఇబ్బందులు, అవ‌మానాల‌కు గురైన ప‌వ‌న్ త‌ల్లి ప‌వ‌న్‌ను పెంచి పెద్ద చేస్తోంది.

ప‌వ‌న్ పెద్ద‌య్యాక త‌న తండ్రి మొద‌టి భార్య సంతానం వ‌ల్ల తండ్రికి వ‌చ్చిన చిక్కుల‌ను ఎలా ప‌రిష్క‌రించాడు ? చివ‌ర‌కు ఈ ఫ్యామిలీ అంతా ఎలా ఎక్క‌టైంది అన్న‌దే ఈ సినిమా స్టోరీ అని తెలుస్తోంది.ఓవ‌రాల్‌గా సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తోంది.

ప‌వ‌న్ స‌ర‌స‌న కీర్తి సురేష్, అను ఇమాన్యుయెల్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై కె.రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు.కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద్ర‌న్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube