పవన్ ' ఉక్కు ' సంకల్పం ! బీజేపీ పొత్తు రద్దు కోసమా ?

Pawan To Fight For Privatization Of Visakhapatnam Steel Plant

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.చాలా కాలంగా ఇదే విషయంపై ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

 Pawan To Fight For Privatization Of Visakhapatnam Steel Plant-TeluguStop.com

రెండు పార్టీలు పేరుకు పొత్తు పెట్టుకున్నాయి తప్ప,  విడివిడిగానే రాజకీయ కార్యక్రమాలు చేపడుతూ ఉండడం, ఒకరితో ఒకరికి సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉండడం, ఎవరికి వారు విడివిడిగా రాజకీయ పోరాటాలు చేస్తూ ఉండటం,  తదితర పరిణామాలతో  ఈ రెండు పార్టీల మధ్య రద్దు అవుతుందనే అంచనా వేస్తూ వస్తున్నారు.అయితే జనసేన తోనే తాము కలిసి వెళ్తాము అని, 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాం అంటూ ఇప్పటికే బీజేపీ ప్రకటించింది.

ఇదే విషయాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సైతం చెప్పారు.

 Pawan To Fight For Privatization Of Visakhapatnam Steel Plant-పవన్ ఉక్కు సంకల్పం బీజేపీ పొత్తు రద్దు కోసమా -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

 టిడిపి జనసేన పార్టీలు పొత్తు పెట్టుకొబోతున్నాయి అనే మరో ప్రచారం తెరపైకి వచ్చిన నేపథ్యంలో , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వేడి పుట్టించేందుకు సిద్ధమయ్యారు.

ఈ మేరకు ఈ నెల 31వ తేదీన విశాఖకు వెళ్తున్నారు.ఆ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఆయన స్పందించి, కార్మికులు, ఉద్యోగ సంఘాల కు సంఘీభావం ప్రకటించబోతున్నారు.

  ఇంత వరకు బాగానే ఉన్నా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెర మీదకు వచ్చి చాలా కాలమైంది.కానీ ఆ సమయంలో పవన్ ఈ అంశంలో జోక్యం చేసుకునేందుకు ఇష్టపడలేదు.

స్టీల్ ప్లాంట్ కార్మికులు రోడ్ల మీదకు వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ,  జనసేన పెద్దగా స్పందించలేదు.

 కానీ బిజెపి విషయంలో పవన్  అసంతృప్తితో ఉండడంతో , ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కు వ్యతిరేకంగా పోరాటాలు మొదలుపెట్టినట్లు గా వ్యవహరిస్తున్నారు.  బీజేపీతో పొత్తు పెట్టుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఇప్పుడు అనుకోవడం చూస్తుంటే, బీజేపీతో పొత్తు రద్దు చేసుకునేదుకు తాము సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను బిజెపి పెద్దలకు తెలియజేసేందుకు ఈ విధంగా వ్యవహరించడం పై అనేక సందేహాలు మొదలయ్యాయి.ఏపీ ప్రభుత్వం తో పాటు,  ప్రభుత్వ విధానాలపైనా ప్రశ్నిస్తూ సొంతంగా జనసేన ఇమేజ్ పెంచుకోవాలని తాపత్రయం తో పాటు,  బీజేపీకి దూరం అవ్వాలనే అభిప్రాయంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది.

#Chandrababu #Janasenani #Pavan Kalyan #Ysrcp #Vizag Steel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube