పవన్ సైలెంట్ అయిపోయినట్టేనా ? కారణం అదేనా ?  

Reason For Pawan Silent-bsp,mayawati,pawan,political Updates,silent

ఏపీ రాజకీయాల్లోకి ఎంత దూకుడుగా వచ్చాడో ఎన్నికలయ్యాక అంతకంటే స్పీడ్ గా సైలెంట్ అయిపోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఏపీ రాజకీయాల్లో నిత్యం చర్చ నడుస్తూనే ఉంది. అసలు తాను అధికారం రాజకీయాల్లోకి రాలేదని, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోకి దూకూడు మీద వచ్చడు. ఇటీవల జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో తమ అభ్యర్దులను ఎన్నికల బరిలో దించారు...

పవన్ సైలెంట్ అయిపోయినట్టేనా ? కారణం అదేనా ?-Reason For Pawan Silent

సీపీఐ సీపీఎం, బీఎస్పీ పార్టీలతో పొత్తు పెట్టుకుని మరీ రంగంలోకి దిగాడు. ఆ సమావేశాల్లోనే టీడీపీ వైసీపీ పార్టీలకు వ్యతిరేకంగా అనేక మాటలు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి బీఎస్పీ అధినేత్రి మాయావతినీ రప్పించారు.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి పోలింగ్ ముగిసే వరకు మధ్య మధ్యలో కొంచెం కొంచెం విరామం తీసుకుంటూ ఎక్కడో ఒకచోట సభలు సమావేశాలు పెడుతూ ఉన్నాడు.

కాకపోతే పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి ఆదివారం వరకూ ఆయన ఎక్కడా బహిరంగంగా నోరు మెదపలేదు.ఇదే ఇప్పుడు పవన్ మీద అనేక అనుమానాలు పెంచుతోంది. మిగతా పార్టీల విషయానికి వస్తే వైసీపీ, టీడీపీ కూడా ఎన్నికలు జరిగిన తీరుపై పార్టీ అభ్యర్థులు, నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

అంతే కాదు ఆ రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుని పొలిటికల్ హీట్ పెంచుతున్నారు.

ఏపీలో ప్రధాన పార్టీల అధ్యక్షులు పోలింగ్ సరళిపైన, గెలుపు అవకాశంపైనా స్పందిస్తున్నారు. అయితే పవన్ మాత్రం ఆదివారం వరకు రెస్ట్ తీసుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. దీనికి కారణం ఏపీలో తమకు అనుకూల పవనాలు వీయలేదు అనే విషయాన్ని పవన్ గ్రహించడమే అని ఆయన సన్నిహితులు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

తాను అధికారంలోకి రాకపోయిన కింగ్ మేకర్ అయినా అవుతానని పవన్ ముందు నుంచి ఆయాసపడుతూ వచ్చారని కానీ ఈ ఎన్నికల్లో సీన్ రివర్స్ అవ్వడం పవన్ తట్టుకోలేకపోతున్నారని సమాచారం. ఇక నిన్న ఆర్డీవరం మంగళగిరిలో పవన్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో కూడా పెద్దగా పొలిటికల్ టాపిక్స్ మాట్లాడలేదని తెలుస్తోంది.