తెలంగాణాలో పవన్ మద్దతు వీరికేనట !  

తెలంగాణ లో ప్రస్తుతం ఎన్నికల అంకం ఫైనల్ కి చేరింది. అన్ని పార్టీలు ప్రచారానికి ముగింపు పలికి పోలింగ్ తేది కోసం టెన్షన్ టెన్షన్ గా ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే… ఏపీలో టీడీపీ మినహా మిగిలిన ప్రధాన పార్టీలైన వైసీపీ .. జనసేన పార్టీలు తెలంగాణాలో ఏ పార్టీకి మద్దతు పలకబోతున్నాయో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దీంతో … ఇప్పటికే వైసీపీ ఫలానా పార్టీ అని చెప్పకుండా మంచి చేయగలిగినవారికి ఓటెయ్యండి అంటూ ప్రకటించింది.కానీ పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికింది.ఇక మిగిలింది జనసేన. ఈ పార్టీ అధినేత పవన్ తన మద్దతు ఎవరికో రేపు చెప్తాను అంటూ నిన్న ప్రకటించాడు.

Pawan Said He Would Support Any Party In Telangana-

Pawan Said He Would Support Any Party In Telangana

తాజాగా ఈ రోజు…. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం..తక్కువ సమయం ఉండటం వల్లే జనసేన పార్టీ పోటీకి దూరంగా ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ యువత ఈరోజు తెలంగాణను తెచ్చుగోగలిగిందని ఆయన అన్నారు. తెలంగాణను ఇచ్చామని ఒకరు..తెలంగాణను తెచ్చామని మరొకరు..చెబుతున్నారని..ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో ప్రజలు ఎవరికి ఓటేయాలనే స్థితిలో ఉన్నారన్నారు. ఎవరైతే ఎక్కువ పారదర్శకతతో, తక్కువ అవినీతితో పాలన అందించగలరో ప్రజలందరూ ఆలోచించి వారికే ఓటేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.