అన్నయ్య వస్తాడో రాడో ? తమ్ముడికి సలహాలు మాత్రమేనా ? 

అన్నయ్య పొలిటికల్ ఎంట్రీపై తమ్ముడు భారీగానే ఆశలు పెట్టుకున్నాడు.ఆ విషయాన్ని నేరుగా చెప్పలేక జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పవన్ చెప్పించారు.

 Pawan Kalyan Clarity On Political Entry Of Chiranjeevi In Janasena, Janasena, Bj-TeluguStop.com

చిరంజీవి ఆశీస్సులు ఎప్పుడూ జనసేన కు ఉంటాయని,  భవిష్యత్తులోనూ జనసేనకు చిరంజీవి అండదండలు ఉన్నాయని చెప్పడంతో , జనసేన పార్టీలోకి చిరు చేరబోతున్నారని, రెండు మూడు రోజులుగా హడావుడి పెరిగిపోయింది.అసలు చిరంజీవి కానీ, పవన్ కానీ ఈ విషయాన్ని నేరుగా ప్రస్తావించకపోవడం తో దీనిపై సరైన క్లారిటీ రాలేదు.

దీంతో రకరకాల ఊహాగానాలు రాజకీయవర్గాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా కాపు సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్  ఈ అంశంపై   స్పందించారు.

  తన అన్నయ్య జనసేన పార్టీలో చేరికపై ఇప్పుడే ఏమి చెప్పలేను అంటూ పవన్ ప్రకటించి మరింత గందరగోళం సృష్టించారు.దీంతో చిరంజీవి జనసేన పార్టీలో చేరే ఉద్దేశం లేదని, కేవలం ఆయన ఎప్పటికైనా జనసేన వెనకాల అండగా నిలబడతారనే ఆశాభావంతో నాదెండ్ల మనోహర్ ద్వారా పవన్  ప్రకటన చేయించారనే విషయం క్లారిటీ వచ్చేసింది.

గతంలో చిరు ప్రజారాజ్యం స్థాపించిన తరువాత, కాంగ్రెస్ లో పార్టీ ని విలీనం చేయడం , ఇప్పుడు పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు.కానీ ఇప్పుడు జనసేన లోకి వచ్చి రాజకీయంగా చిరంజీవి కోరి ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం లేదనే విశ్లేషణలు ఇప్పుడు మొదలయ్యాయి.

Telugu Ap, Congress, Janasena, Kapu, Pavan Kalyan, Prajarajyam-Telugu Political

అదీ కాకుండా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తోనూ సన్నిహితంగా మెలుగుతున్న చిరు ఇప్పుడుకిప్పుడు జనసేన పార్టీలోకి వచ్చినా, లేక మద్దతు ప్రకటించినా అధికారంలోకి వచ్చేంత స్థాయిలో జనసేన లేదనే విషయం ఆయనకు బాగా తెలుసు.అందుకే ఎన్ని రకాల ఊహాగానాలు వస్తున్నా, మౌనంగానే ఉంటున్నారు.అయితే కేవలం రాజకీయాల కాకుండా సినిమాల్లో నటించాలి అంటూ చిరంజీవి పవన్ కు సలహాలు ఇవ్వడం వెనుక అనేక కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.రాజకీయాల్లో రాణించాలని, పూర్తిగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటూ సొంత సామాజిక వర్గానికి దగ్గరవ్వాలని , సినిమా రంగాన్ని విడిచిపెట్టకూడదు అనే అభిప్రాయంతోనే చిరు సలహా ఇచ్చినట్లు అర్థం అవుతుంది.

అది కాకుండా , ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న కారణంగా ఒక వేళ రాజకీయంగా సక్సెస్ కాలేకపోయినా, సినిమా రంగం ను దూరం చేసుకోకుండా ఉండడం వల్ల భవిష్యత్తుకు దొఖా ఉండదు అనే అభిప్రాయంతోనే చిరంజీవి ఇప్పుడు  సలహాలు ఇస్తున్నారు అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవతున్నాయి.మొత్తంగా చూస్తే చిరంజీవి పరోక్ష సహకారం తప్ప ప్రత్యక్షంగా జనసేన కు మద్దతుగా జనాల్లోకి వచ్చే అవకాశం లేదనే విషయం ఇప్పుడు క్లారిటీ కి వచ్చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube