అకీరా పై ఒత్తిడి మరింతగా పెరిగే అవకాశం ఉంది

టాలీవుడ్‌ లోనే కాకుండా అన్ని భాషల సినిమా ఇండస్ట్రీల్లో కూడా వారసులు అనేది చాలా కామన్ విషయం అయ్యింది.వారసత్వంతో వచ్చిన వారికే ఇండస్ట్రీలో ఆఫర్లు వస్తున్నాయి.

 Pawan Renu Desai Son Akira Nandan Movie Entry , Akira Nandan, Akira Nandan Movie, Movie News, Pawan Kalyan, Renu Desai, Tolllywood-TeluguStop.com

ఇండస్ట్రీకి చెందిన వారికి 90 శాతం ఆఫర్లు వస్తూ ఉంటే కేవలం 10 శాతం మంది మాత్రమే బయటి వారు వస్తున్నారు.ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీ ఇచ్చినా కూడా వారికి ట్యాలెంట్‌ లేకపోవడంత్ చాలా మంది కనుమరుగు అవుతున్నారు.

ఇక మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చినా కూడా స్టార్‌ డమ్‌ దక్కించుకుంది కొద్ది మంది మాత్రమే.అంతా అనుకుంటున్నట్లుగానే చాలా మంది మెగా ఫ్యామిలీ నుండి హీరోలు క్యూ కట్టబోతున్నారు.

అందులో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్‌ కూడా ఉండబోతున్నాడు అనేది ఇండస్ట్రీ వర్గాల వారి నుండి అందుతున్న సమాచారం.అకీరా ఇండస్ట్రీ లో అడుగు పెడుతాడా లేదా అనే విషయంలో క్లారిటీ అయితే లేదు.

కాని పవన్‌ కళ్యాణ్ అభిమానులు మాత్రం సోషల్‌ మీడియాలో అకీరా కు ఫ్యాన్ గ్రూప్ లు ఏర్పాటు చేసి మరీ ఫాలో అవుతున్నారు.ఆయన ఎప్పుడెప్పుడు హీరోగా పరిచయం అవుతాడా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పవన్ మరియు రేణు దేశాయ్ విడిపోయినా కూడా పిల్లలకు ఇబ్బంది కలుగకుండా సందర్బానుసారంగా కలుస్తూనే ఉన్నారు.అకీరా తాజాగా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు.ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో పవన్‌ కళ్యాణ్ మరియు రేణు దేశాయ్‌ లు పాల్గొన్నారు.ఆ సమయంలో తీసుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ప్రతి ఒక్కరు కూడా అకీరా గ్రాడ్యుయేషన్ అయ్యింది.కనుక ఇక వెంటనే సినిమా ల్లో చేయాల్సిందే అంటూ ఒత్తిడి చేస్తున్నారు.

సినిమా ల్లో ఆయన నటించాల్సిందే అంటూ మెగా ఫ్యాన్స్ చేస్తున్న డిమాండ్‌ తో సోషల్‌ మీడియా దద్దరిల్లుతోంది.అయితే ఇప్పటి వరకు అకీరా కనీసం రెస్పాండ్‌ అవ్వక పోవడం తో అసలు ఆయనకు ఆ ఉద్దేశ్యం ఉందా అనేది తెలియడం లేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube