తిరుపతి ప్రచారానికి పవన్ రెడీ ! షెడ్యూల్ ఇదే

పోటీ చేస్తున్నాము అన్న సంతోషం తప్ప , తిరుపతిలో గెలుస్తామా లేదా అనే సవాలక్ష సందేహాలు ఏపీ బీజేపీ నేతలను వెంటాడుతున్నాయి.తమ మిత్రపక్షంగా ఉన్న జనసేన ఈ ఎన్నికలలో తమకు సహకరిస్తుందా లేదా అనేది కూడా ఆ పార్టీ నేతలకు అనుమానంగానే ఉంటూ వచ్చింది.

 Pawan Kalyan Ready To Campaign For Bjp Candidate Ratnaprabha In Tirupathi Electi-TeluguStop.com

దీనికి కారణం తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని చూడడమే.కానీ బీజేపీ అనూహ్యంగా తమ అభ్యర్థిని ప్రకటించడం, దీనికి పవన్ మద్దతు ఇవ్వాల్సి రావడంతో పవన్ ఆగ్రహంగా ఉన్నారని బీజేపీ నేతలు గ్రహించారు.

అందుకే పదేపదే పవన్ ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.ఇప్పటివరకు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి పవన్ వస్తారా ? బిజెపి కోసం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారా అనేది సందేహంగా ఉంటూ వచ్చింది.

ఎట్టి  పరిస్థితుల్లోనూ పవన్ ఎన్నికల ప్రచారానికి రారు అని, బీజేపీ అభ్యర్థి రత్నప్రభ కు ఓటు వేయాలని సోషల్ మీడియా ద్వారా మాత్రమే ప్రచారం చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి.దీంతో బీజేపీ ఏపీ నేతల్లో టెన్షన్ మరింత పెరుగుతూ వచ్చింది.

బీజేపీ అగ్రనేతలు సైతం తిరుపతి ఎన్నికల ప్రచారానికి వస్తుండడంతో, పవన్ కనుక ఈ ఎన్నికల ప్రచారానికి రాకపోతే, బీజేపీ తిరుపతి లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని,తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో బలంగా ఉన్న జనసేన పార్టీ మద్దతు లేకపోతే గెలవడం కష్టమనే అభిప్రాయానికి వచ్చిన బిజెపి నేతలు పవన్ ప్రచారానికి రావాల్సిందిగా ఒత్తిడి చేయడంతో,  ఎట్టకేలకు పవన్ తిరుపతిలో పర్యటించేందుకు సిద్దం అవుతున్నారు.ఈ మేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటన చేశారు.

Telugu Ap, Janasena, Pavan Kalyan, Pawan Bjp, Pawantirupathi, Ratnaprabha, Tirup

ఏప్రిల్ 3వ తేదీన పవన్ తిరుపతిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని, బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ కు మద్దతుగా తిరుపతి నగరంలోని ఎంఆర్ పల్లి సర్కిల్ నుంచి ఏఐ ఆర్ బైపాస్ మీదుగా, శంకరంబాడి సర్కిల్ వరకు పాదయాత్ర చేపడతారని ప్రకటించడంతో బీజేపీలో ఎక్కడలేని ఆనందం కనిపిస్తోంది.పవన్ పర్యటన ద్వారా తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో మంచి ఊపు వస్తుంది అని, జనసేన నాయకులు పెద్ద ఎత్తున బీజేపీ కి మద్దతుగా ఎన్నికల ప్చారం నిర్వహిస్తారని బీజేపీ అభిప్రాయపడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube