జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి మృతి పై స్పందించిన పవన్ ..ట్వీట్ వైరల్!

సినిమా ఇండస్ట్రీలో వరస మరణాలు చోటు చేసుకుంటూ ఇండస్ట్రీని తీవ్ర విషాదంలోకి ముంచేస్తున్నాయి.గత వారం రోజుల క్రితం నటి మీనా భర్త మృతి చెందడంతో ఒక్కసారిగా సినీ ప్రపంచం షాక్ కి గురైంది.

 Pawan Reacted To The Death Of Journalist Gudipudi Srihari Tweet Went Viral, Pawan Kalyan , Tollywood , Journalist , Gudipudi Srihari , Tweet Viral , Pawan Kalyan Tweet-TeluguStop.com

ఈ క్రమంలోనే నేడు ఉదయం ప్రముఖ నటుడు ఆర్ నారాయణ మూర్తికి మాతృ వియోగం జరిగింది.అయితే ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ప్రముఖ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి మృతి అందరినీ విషాదంలోకి నెట్టివేసింది.

జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

 Pawan Reacted To The Death Of Journalist Gudipudi Srihari Tweet Went Viral, Pawan Kalyan , Tollywood , Journalist , Gudipudi Srihari , Tweet Viral , Pawan Kalyan Tweet-జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి మృతి పై స్పందించిన పవన్ ..ట్వీట్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈయన నేడు(మంగళవారం) ఉదయం అనారోగ్య సమస్య తీవ్రతరం కావడంతో తన ఇంటిలోనే తుది శ్వాస విడిచారు.

ఈయన ప్రముఖ వార్తా పత్రికలలో జర్నలిస్టుగా పనిచేస్తూనే గత 55 సంవత్సరాల నుంచి సినీ విశ్లేషకులుగా ఉంటున్నారు.ఇలా గత కొన్ని సంవత్సరాల నుంచి జర్నలిస్టుగా తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న గుడిపూడి శ్రీహరి మృతి చెందడంతో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ గుడిపూడి శ్రీహరి పాత్రికేయ రంగంలో ప్రత్యేకించి సినిమా జర్నలిజంలో శ్రీహరి గారిది విశేష అనుభవం ఆయన ఎన్నో సినిమాలకు రివ్యూలు ఇవ్వడం అందరికీ ఎంతో ఆసక్తికరంగా మారాయి అంటూ పవన్ కళ్యాణ్ గుడిపూడి శ్రీహరి గొప్పతనం గురించి వివరిస్తూ ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తూ తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube