మంత్రి పదవి కాదు .. అంతకు మించి ! బీజేపీ పై పవన్ ఒత్తిడి ?

అతి త్వరలోనే కేంద్ర మంత్రి వర్గాన్ని విస్తరించేందుకు కేంద్ర అధికార పార్టీ బిజెపి ప్రయత్నాలు మొదలు పెట్టింది.ప్రస్తుతం ఉన్న మంత్రులలో కొంతమందిని తప్పించి అదనంగా మరికొంత మంది మంత్రులను తీసుకోవాలని ప్రధాని మోదీ అమిత్ షా లు అభిప్రాయపడుతున్నారు.

 Pawan Put Pressure On The Bjp Not To Give Much Importance To Jagan-TeluguStop.com

ఈ మంత్రివర్గంలో బిజెపి బలహీనంగా ఉన్న రాష్ట్రాలకు చెందిన వారికి అవకాశం కల్పించాలని చూస్తున్నారు.దీంతో ఏపీ నేతల్లోనూ ఆశలు రేకెత్తాయి.

దీనికి కారణం ఏపీ నుంచి ఒకరిని మంత్రివర్గం లోకి తీసుకోబోతున్నారు అనే సంకేతాలే వచ్చాయి.దీంతో ఆ మంత్రి పదవి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇవ్వబోతున్నారని, రాజ్యసభ సభ్యత్వం తో పాటు, కేంద్ర మంత్రి పదవి అప్పగించడం ద్వారా ఏపీలో జనసేన బీజేపీ మరింతగా బలపడుతుందని,  రాబోయే రోజుల్లో అధికారం దక్కించుకునే అంత స్థాయిలో బలం పుంజుకుంటుందనే లెక్కల్లో బిజెపి పెద్దలు ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి.

 Pawan Put Pressure On The Bjp Not To Give Much Importance To Jagan-మంత్రి పదవి కాదు .. అంతకు మించి బీజేపీ పై పవన్ ఒత్తిడి -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అసలు పవన్ కళ్యాణ్ కు మంత్రి పదవి అనే విషయం బయటకు రావడానికి ఆర్ఎస్ఎస్ లో కీలకంగా ఉన్న సంతోష్ కుమార్ అనే వ్యక్తే కారణమట.కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య కు బంధువైన సంతోష్ కుమార్ ఆర్ఎస్ఎస్ లో కీలక నేతగా గుర్తింపు పొందారు.

ప్రధాని నరేంద్ర మోదీ,  అమిత్ షా లకు నచ్చని వ్యక్తులకు కూడా ఆయన కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించడం, ఎన్నో బిజెపి పాలిత రాష్ట్రాల్లో కొంతమందికి కీలక పదవులు సంతోష్ కుమార్ సిఫార్సు పై పదవులు పొందిన వారు ఉండడం వంటివి ఆయన స్థాయిని తెలియజేస్తున్నాయి.ఆయన ద్వారానే బీజేపీ జనసేన పొత్తు కుదిరింది అనే ప్రచారం అప్పట్లో జరిగింది.

అయితే పవన్ మాత్రం కేంద్ర మంత్రి పదవి విషయంలో అంత ఆసక్తిగా లేరట.

Telugu Amith Sha, Ap Cm, Ap Government, Bjp, Cbn, Jagan, Modhi, Pavan Central Minister, Pavan Kalyan, Rss Santhosh Kumar, Tdp, Ysrcp-Telugu Political News

అసలు జనసేన పొత్తు పెట్టుకున్న సమయంలోనే వైసీపీ కి బిజెపి ఏ విషయంలోనూ ప్రాధాన్యం ఇవ్వకూడదనే షరతు విధించారట.అయినా అనేక సందర్భాల్లో బిజెపి వైసీపీకి సహకరించడం పవన్ కు ఆగ్రహం కలిగిస్తుందట.అందుకే పవన్ తనకు ఆగ్రహం కలిగినప్పుడల్లా బిజెపిపై విమర్శలు చేస్తూ వస్తున్నారట.
  అలాగే జగన్ బెయిల్ రద్దు కాకుండా కేంద్ర బీజేపీ పెద్దలు తగిన సహకారం అందిస్తున్నారనే సమాచారం పవన్ లో ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయట.తనకు మంత్రి పదవి అవసరం లేదు కానీ,  జగన్ విషయంలో బిజెపి పెద్దలు సానుకూలంగా వ్యవహరించకుండా కట్టడి చేయాలని ఆర్ఎస్ఎస్ నేతలపై ఎప్పుడూ పవన్ ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది.

#AP Cm #Ysrcp #Modhi #AP Government #Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు