Pawan Kalyan : విశాఖ, గోదావరి జిల్లాల నేతలతో పవన్ భేటీ..!!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) 2024 ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.ఎట్టి పరిస్థితులలో వైసీపీ( YCP ) మరోసారి అధికారంలోకి రాకూడదని టార్గెట్ గా పెట్టుకున్నారు.

 Pawan Met The Leaders Of Godavari Districts Of Visakha-TeluguStop.com

ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఒకపక్క టీడీపీ..

( TDP )మరోపక్క బీజేపీ పార్టీలతో కూటమిగా ఏర్పడటం జరిగింది.ఈ కూటమికి చంద్రబాబు పెద్దగా వ్యవహరిస్తున్నారు.

వచ్చే ఎన్నికలలో ఏరకంగా ముందుకెళ్లాలి అన్నదానిపై ఇటీవలే తన నివాసంలో జనసేన.బీజేపీ పెద్దలతో చంద్రబాబు మంతనాలు జరపడం జరిగింది.

ఈ క్రమంలో సీట్ల సర్దుబాటు విషయంలో ఓ అవగాహనకి రావడం జరిగింది.

ఇదిలా ఉంటే పొత్తు ధర్మంలో భాగంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించడం తెలిసిందే.తొలి లిస్ట్ లో ఐదుగురు అభ్యర్థులను ప్రకటించారు.ఇప్పుడు మిగిలిన అభ్యర్థులను ప్రకటించడానికి సిద్ధపడటం జరిగింది.

ఈ క్రమంలో గురువారం అనగా రేపు జనసేన తుది జాబితా విడుదల చేయడానికి పవన్ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.కాగా విశాఖ, గోదావరి జిల్లాలకు చెందిన పార్టీ కీలక నేతలతో బుధవారం మంతనాలు జరిపారు.

ఒక్కో అభ్యర్థితో.మాట్లాడుతూనే మరోపక్క అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తు చేయడం జరిగింది.

దీంతో  రేపు 16 స్థానాల్లో పోటీ చేసే వారి పేర్లను పవన్ ప్రకటించే అవకాశం ఉందట.సో రేపు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పోటీపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube