పవన్ నవ్వుల పాలు..కాపులకి దూరం అయ్యాడా..??

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ తీరులో విభిన్న కోణాలు కనిపిస్తున్నాయి.ఒక పక్క తాను కింగ్ మేకర్ అవ్వాలనే తపనో లేక చంద్రబాబు ని మళ్ళీ అందలం ఎక్కించాలనే కసో తెలియదు కాని మొత్తానికి పవన్ కళ్యాణ్ రోజుకో మాట పూటకో సెల్ఫ్ గోల్ వేసుకుంటూ రాజకీయ జీవితాన్ని సాగిస్తున్నారు.

 Pawan Lost Kapu Voters-TeluguStop.com

ఇప్పటి వరకూ పవన్ ప్రవర్తనా తీరు ఒక్క సారి పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ కి ఉన్న ఏకైక లక్ష్యం జగన్ సీఎం కాకూడదు అనే ఆలోచనే ఉన్నట్టుగా తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ భీమవరంలో నామినేషన్ వేసిన సందర్భంగా మాట్లాడిన విషయాలు ఒక్క సారి గుర్తు చేసుకుంటే.

పులివెందుల కిరాయి మూకలను తెస్తే ఊరుకునేది లేదంటూ తానేదో మోనార్క్ లా జగన్ హెచ్చరించారు.దాంతో నవ్వుల పాలయ్యారు.అసలు పవన్ నామినేషన్ వేయటానికి పులివెందుల కిరాయి మనుషులంటూ వ్యాఖ్యలు చేయడానికి సంభంధం ఎక్కడైనా ఉందా…?? మాట మాట్లాడితే పులివెందుల ప్రస్తావన తెస్తూ గావుకేకలు పెట్టి కురాళ్ళని రెచ్చగొట్టడం ఎందుకు.?? సరే గాజువాకలో సభలో మాట్లాడుతూ తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినా జగన్ చేతకాని వాడిలా చూస్తున్నాడు అంటూ కస్సు బస్సు మన్నారు పవన్ అసలు బాబాయ్ హత్య జరిగితే జగన్ ఏం చేస్తాడు ? అధికారంలో ఉన్నది జగనా , బాబా అనే మినిమమ్ కామన్సెన్స్ లేకుండా పవన్ వ్యవహరించడంతో మరో సారి ఏపీ ప్రజలు పవన్ తీరుపై నవ్వుకున్నారు.

తెలంగాణలో ఏపీ వాళ్ళపై దాడులు చేస్తున్నారు అంటూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ కేసీఆర్ పాలన సూపర్ అంటూ ప్రకటించడాన్ని సోషల్ మీడియా సాక్షిగా కొన్ని వేల మంది గుర్తు చేసి పవన్ ఫ్యూజులు పీకేశారు.హైదారాబాద్ లో చాలామంది రాజకీయ నేతలు ,పారిశ్రామిక వేత్తలు, సినీ సెలబ్రిటీలు ఉన్నారు వారికి భారీగానే ఆస్తులు ఉన్నాయి.మరి ఇప్పటి వరకూ ఒక్కరిపై కూడా ఎటువంటి దాడులు జరగలేదు కదా మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఏపీ ప్రజల ముందు హీరో అవ్వాలనే తాపత్రయం అర్థం కాని పరిస్థితి.

ఇక కాపులు ఎంతగానో వ్యతిరేకిస్తున్న చంద్రబాబు నాయుడికే ఈ ఎన్నికల్లో పవన్ మద్దతు ఇస్తున్నారని బహిరంగంగా తెలిసిపోవడంతో, కాపు సంఘాలు పవన్ తీరుపై ఫైర్ అవుతున్నాయట.అన్న చిరంజీవి గతంలో మమ్మల్ని ముంచేశాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మమ్మల్ని ముందు నుంచీ నమ్మించి ఒక్క సారిగా చంద్రబాబు చెప్పినట్లు నడుచుకోవడంతో అన్నలాగానే మరో సారి ముంచడానికి వచ్చాడు.పవన్ వెనుక గుడ్డిగా వెళ్తే రేపు నష్టపోయేది మనమే అనే నిర్ణయానికి వచ్చేశారట.

వెనుక మర్మం ఏమిటో గ్రహించగలం అంటూ ఫైర్ అవుతున్నారట.ఒక నిర్ణయానికి వచ్చేశారట దాంతో చివరి నిమిషంలో కాపుల మద్దతు కూడా దాదాపు పవన్ కళ్యాణ్ కి తగ్గిందని అంటున్నారు పరిశీలకులు.

ఇదే నిజమైతే కాపు సంఘాలు పవన్ కి ఈ ఎన్నికల్లో దూరంగా ఉంటే పవన్ తన అన్నకంటే కూడా ఘోరమైన ఓటమి చెందటం తప్పదని అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube