లోకేష్ ని రెచ్చగొడుతున్న పవన్ ! రీజన్ ఏంటో..?       2018-07-08   23:37:08  IST  Bhanu C

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా నారా లోకేష్ ని టార్గెట్ చేసుకుంటున్నాడు. లోకేష్ నుంచి పవన్ వైపు విమర్శల బాణాలు రాకుండానే ముందుగా పవన్ రియాక్ట్ అయిపోతున్నాడు. దీనికి కారణాలు కూడా పెద్దగా లేకపోయినప్పటికీ అసలు లోకేష్ ని టార్గెట్ చేసుకోవడం వెనుక గల కారణాలను అన్వేషించే పనిలో పడింది టీడీపీ. అయితే పవన్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. పవన్ ని టార్గెట్ గా చేసుకుని ఇటీవల విమర్శలు చెలరేగడం, వాటికి మీడియా ఫోకస్ రావడం వెనుక లోకేష్ హస్తం ఉన్నట్టు పవన్ భావిస్తున్నట్టు అర్ధం అవుతోంది. ఆ కోపం కారణంగానే పవన్ రెచ్చిపోతున్నట్టు కనిపిస్తోంది. లోకేష్ మాత్రం పవన్ విషయంలో ఎక్కడ బహిరంగంగా భారీ విమర్శలు చేయడం లేదు. పవన్ కళ్యాణ్ గారు నిజా నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది అని లోకేష్ చెప్తున్నాడు.

శేఖర్ రెడ్డితో లోకేష్‌కు సంబంధాలు అంటగట్టినప్పటి నుంచి పవన్ కల్యాణ్‌ది అదే ఫ్లో. శ్రీరెడ్డి అనే నటీమణి పవన్ కల్యాణ్‌ను తిట్టినప్పుడు.. మీడియాలో వచ్చిన హైప్‌కి కూడా.. లోకేషేనని పవన్ కల్యాణ్ తేల్చారు. పవన్ మిత్రబృందం పేర్లు చెప్పి వీరంతా తనను రాజకీయంగా అణిచివేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు.లోకేష్ ఎంత సాఫ్ట్‌గా స్పందిస్తూంటే పవన్ అంత సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు. నిన్న మళ్లీ..లోకేష్‌కు సవాల్ చేశారు. దమ్ముంటే.. మంత్రి పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేసారు.

నిజానికి ఇప్పుడు లోకేష్‌ పవన్ కల్యాణ్‌పై ఎలాంటి విమర్శలు చేయలేదు. విశాక ప్రత్యేకహోదా నిరసన యాత్రలో. పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు..లోకేష్ ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చారు. విభజన హామీల అమలు కోసం.. కేంద్రంపై పోరాడుతున్నది తామేనని గుర్తించాలన్నారు. లోకేష్ రాజకీయ వారసత్వాన్ని పవన్ కల్యాణ్ విమర్శిస్తూంటారు. విశాఖ సభలోనే.. “ముఖ్యమంత్రుల కొడుకులు.. ముఖ్యమంత్రులు అయితే.. వారితో మేము తొక్కించుకోవాలా” అంటూ ఘాటు విమర్శలు చేశారు. అసలు లోకేష్‌కు, పవన్‌కు ఎక్కడ చెడిందన్న విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. కానీ.. పవన్ కల్యాణ్ ప్రసంగాల్లో మాత్రం దానికి సంబంధించిన సూచనలు మాత్రం కనిపిస్తూంటాయి.