అల్లు అర్జున్ పుష్పలో పవన్ కళ్యాణ్.. అసలు నిజమేంటి?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ లో భాగంగా బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే ఎన్నో విషయాలు సోషల్ మీడియా ద్వారా లీక్ అవుతూనే వస్తున్నాయి.

 Pawan Kalyna On Pushpa Movie Sets-TeluguStop.com

ఈ లీకుల విషయం గురించి ఎంతో మంది హీరోలు ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఏమాత్రం ఆగడం లేదు.తాజాగా పుష్ప సినిమా నుంచి మరొక ఆసక్తికరమైన విషయం లీక్ అవడంతో ఇటు అల్లు అర్జున్ అభిమానులు -అటు పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

అసలు ఇంతకీ పుష్ప సినిమాతో పవన్ కళ్యాణ్ కి సంబంధం ఏమిటి అనే సందేహం ప్రతి ఒక్కరికి రాకమానదు.అయితే అసలు విషయం ఏమిటంటే.

 Pawan Kalyna On Pushpa Movie Sets-అల్లు అర్జున్ పుష్పలో పవన్ కళ్యాణ్.. అసలు నిజమేంటి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఒక లారీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తారన్న సంగతి మనందరికీ తెలిసిందే.ఇప్పటికే అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన ఫోటోలు ఎన్నో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇదిలా ఉండగా ప్రస్తుతం పుష్ప టీం షూటింగ్ సెట్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఇందులో లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ నడిపే లారీఫోటో సోషల్ మీడియాలో లీక్ అయింది.

అయితే ఆ లారీ అద్దం పై బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటో ఉండడం గమనార్హం.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.సాధారణంగా తమ అభిమాన హీరోల ఫోటోలు ఎంతోమంది అభిమానులు వారి వాహనాలపై వేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం.అయితే ఇక్కడ అల్లు అర్జున్ నడిపే లారీ పై పవన్ కళ్యాణ్ ఫోటో ఉండటం విశేషం.

అయితే గతంలో ఒక ఆడియో ఫంక్షన్లో బన్నీ అన్న మాటకు వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.ఓ సందర్భంలో వీరిద్దరూ కలిసి మాట్లాడుతున్నప్పటికీ అల్లు అర్జున్ పై ఆ మచ్చ అలాగే ఉంది.

ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ నడిపే లారీ పై అనుకోకుండా పవన్ కళ్యాణ్ ఫోటో ఉందా? లేక కావలసిగానే లారీ పై పవన్ కళ్యాణ్ ఫోటోను వేశారా? అన్నది తెలియాల్సి ఉంది.

#Allu Arjun #Arjun #Pushpa #Pawan Kalyan #Pusha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు