రెచ్చగొట్టి దాక్కున్న పవన్ కళ్యాణ్

ఓ పదిరోజులు వెనక్కివెళితే “స్పెషల్ స్టేటస్” మీద ఉద్యమించాలన్న అలోచన ఎవరికి ఉందో కనిపెట్టడం కూడా కష్టం.జల్లికట్టు ఉద్యమం కోసం తమిళ ప్రజలు, సినీనటులు ఏకం కావడంతో ఆ నిరసనలు సత్ఫలితాలనిచ్చాయి.

 Pawan Kalyan’s Weak Fight For Special Status-TeluguStop.com

సినీతారలు కేవలం ట్విట్టర్ లో కూర్చోకుండా, ప్రజల వద్దకు వెళ్ళి, ప్రజలతో మమేకమై నిరసనలు తెలిపారు.దానికి ఏ రాజకీయ పార్టీ రంగు కలవకపోవడంతో, అది ఓ పోటిలా మారకుండా, స్వచ్ఛమైన నిరసనగా, అనుకున్నది సాధించుకుంది.

మరి ఏపి స్పేషల్ స్టేటస్ నినాదం అలాగే మొదలైందా? పదిరోజుల క్రితం ఎవరికి గుర్తులేని విషయం ఇది.జల్లికట్టు ఉద్యమాన్ని చూసిన ఊపులో, మనం కూడా ఇలాంటిదేదో చేయాలనే అలోచనతో మొదలైంది.సరే, ఇదేదో మంచి జరిగే విషయం కాబట్టి, పవన్ కళ్యాణ్ పెట్రోల్ ఉన్నచోట నిప్పు పెట్టారు అనుకుందాం.రెచ్చగొట్టడం అనే పదం తప్పు అనిపిస్తే స్ఫూర్తిని రగిలించారు అని అనుకుందాం.

మొదటగా, పవన్ అందించిన సపోర్టులో ప్రతీచోట జనసేన ప్రమోషన్ కనిపించింది.తమిళ సినిమా తారల్లో ఇది లేదు.

మహేష్, ఎన్టీఆర్ అసలు మొత్తానికే మాట్లాడలేదు కాబట్టి, వారికన్నా పవన్ నయం అని అనుకుందాం.మరి 26న ఇలా చేద్దాం అలా చేద్దాం .వైజాగ్ బీచ్ కి కదలిరండి అని ఉద్వేహపూరిత ట్వీట్స్ పెట్టుకొచ్చిన పవన్, నిన్న కూడా ట్విట్టర్ కే పరిమితం అయిపోవడం అందరిని షాక్ కి గురిచేసింది.

నేనున్నాను అనే భరోసా ఎక్కడో హైదరాబాదులో కూర్చోని, ఓ మొబైల్ లో ట్వీట్లు పెడుతూ ఇస్తారా అని అడుగుతున్నారు విశ్లేషకులు.

ఇక చివరగా, ఇక్కడ తప్పుబట్టేది స్పేషల్ స్టేటస్ పై నిరసనని కానే కాదు, ఇక్కడ తప్పుబట్టేది ఊరించి తుస్సుమనించిన పవర్ స్టార్ విధివిధానాల్ని.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube