ఏపీలో హింసకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ మౌనదీక్ష

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో మౌనదీక్షకు దిగారు.గాంధీ జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించిన ఆయన అహింసావాదానికి మద్ధతుగా దీక్షను నిర్వహించారు.

 Pawan Kalyan's Silence Against Violence In Ap-TeluguStop.com

ఈ మేరకు రెండు గంటల పాటు దీక్ష కొనసాగగా ఏపీలో హింసకు వ్యతిరేకంగా చేపట్టినట్లు తెలిపారు.ఈ దీక్షలో జనసేనానితో పాటు నాదెండ్ల మనోహార్, ఇతర నేతలు హాజరయ్యారు.

మచిలీపట్నంలో గాంధీ జయంతి వేడుకలు జరపడం అదృష్టమని పవన్ తెలిపారు.బందర్ గొప్పతనం ఏంటంటే జనసేన ఆవిర్భావ సభలో జాతీయ గీతం రాగానే పది లక్షల మంది లేచి నిలబడ్డారన్నారు.

అధికారంలోకి వచ్చాక గాంధీ జయంతిని మచిలీపట్నంలో నిర్వహిస్తామని చెప్పారు.రాజకీయాల్లో అభిప్రాయ బేధాలు ఉంటాయన్న జనసేనాని తనకు వైసీపీ పాలసీపై మాత్రమే విబేధం ఉందని తెలిపారు.

అంతేకానీ వ్యక్తిగతంగా వైసీపీతో ఎలాంటి విరోధం లేదన్నారు.లాల్ బహదూర్ శాస్త్రి ప్రేరణతో విలువలతో కూడిన రాజకీయాలతో జనసేన ముందుకు వెళ్తుందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube