జగన్ సర్కార్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!

దేశంలో కరోనా విజృభిస్తున్న కారణంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికే పరిమితమైయ్యారు.దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుందో తెలుసుకొని తన అభిప్రాయాన్ని సామాజిక మీడియాలో తెలియజేస్తున్నారు.

 Ap, Janasena Party, Pavan Kalyan, Janasena Leader Pawan Comments On Jagan Govt,-TeluguStop.com

జనసేన పార్టీ కార్యక్రమాల్లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్షలో ఉన్నారు.

తాజాగా ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా పవన్ చాతుర్మాస దీక్ష గురించి వెల్లడించారు.

గతంలో ఆయన ఈ దీక్షను వ్యక్తిగతంగా చేసేవారిని వెల్లడించారు.చాతార్ముస దీక్ష కేవలం మన:శాంతి మాత్రమే కాకుండా.ప్రజలు బావుండాలని ఉద్దేశంతోనే చేస్తున్నాని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిపై జనసేన అధినేత స్పందించారు.

అయితే ప్రభుత్వాలు సంసిద్ధంగా ఉంటే తీవ్రతను తగ్గించొచ్చనన్నారు.ఏపీ ప్రభుత్వం కూడా ఇది ఫ్లూ వంటిదని వ్యాఖ్యానించిందని ఆయన గుర్తు చేశారు.

రెండు నెలల లాక్‌డౌన్ సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకోలేదని తెలిపారు.ఏపీలో లాక్‌డౌన్ తర్వాత కేసులు పెరుగుతున్నాయని అన్నారు.

ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉంటే బావుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

కరోనా టెస్టుల విషయంలో బాగా చేశారని తాను ట్వీట్ చేశానని ఈ సందర్బంగా తెలియజేశారు.

కానీ టెస్టుల తర్వాత రోగులు ఆస్పత్రులకు వెళితే, ఆహారం సరిగా లేదని వెల్లడించారు.ఈ మహమ్మారి బారిన పడిన వారిని ఇంట్లోనే ఉండమని అంటున్నారని విమర్శలు వస్తున్నాయన్నారు.

ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతగా లేదని క్షేత్రస్థాయిలో తెలిపారన్నారు.కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు.

భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు.ప్రభుత్వం బాధ్యత తీసుకుని ప్రజల్లో అవగాహన కల్పించాలి అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube