రాజ్యసభ పదవుల కేటాయింపు పై పవన్ కళ్యాణ్ రియాక్షన్..!!

రాష్ట్రపతి కోటాలో నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేయడం తెలిసిందే.ఈ సందర్భంగా రాజ్యసభకు నలుగురు నామినేట్ కావటం పట్ల సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు.

 Pawan Kalyan's Reaction On Rajya Sabha Allotment Pawan Kalyan, Rajya Sabha, Jaansena, Modi , Bjp, Ilaya Raja, Mr. Vijayendra Prasad, Mr. Virendra Heggade, Mrs. P.t.usha-TeluguStop.com

 శ్రీ ఇళయరాజా, శ్రీ విజయేంద్ర ప్రసాద్, శ్రీ వీరేంద్ర హెగ్గడే, శ్రీమతి పి.టి.ఉషకు శుభాకాంక్షలు.ఎంపిక చేసిన ప్రధాని శ్రీ మోదీ గారు అభినందనీయులు.

శ్రీ ఇళయరాజా, రాజ్యసభ.అంటే పెద్దల సభకు శ్రీ ఇళయ రాజా, శ్రీ విజయేంద్ర ప్రసాద్, శ్రీ వీరేంద్ర హెగ్గడే, శ్రీమతి పి.టి.ఉష సభ్యులుగా నియమితులయ్యారనే వార్త ఎంతో ఆనందాన్ని కలిగించింది.

 Pawan Kalyan's Reaction On Rajya Sabha Allotment Pawan Kalyan, Rajya Sabha, Jaansena, Modi , Bjp, Ilaya Raja, Mr. Vijayendra Prasad, Mr. Virendra Heggade, Mrs. P.T.Usha-రాజ్యసభ పదవుల కేటాయింపు పై పవన్ కళ్యాణ్ రియాక్షన్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాజ్యసభకు రాష్ట్రపతి ద్వారా నామినేట్ అయిన వీరికి నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.స్వర జ్ఞాని శ్రీ ఇళయరాజా, సినీ రచయిత శ్రీ విజయేంద్ర ప్రసాద్, సామాజిక సేవకులు శ్రీ వీరేంద్ర హెగ్గడే, పరుగుల రాణి శ్రీమతి పి.టి.ఉష.తమ రంగాల్లో మన దేశ పేరు ప్రతిష్టలను ఇనుమడింప చేసిన స్రష్టలు.వీరి సేవలు, అనుభవాన్ని సముచితరీతిన గుర్తించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర నాయకత్వానికి అభినందనలు తెలియచేస్తున్నాను.

పదవులు ఇవ్వాలంటే రాజకీయంగా ఎంత లబ్ది కలుగుతుంది? ఎన్ని కోట్లు మన ఇంట్లోకి వచ్చి చేరతాయి అని కొన్ని పార్టీల అధినాయకులు లెక్కలు వేసుకుని ముక్కు ముఖం తెలియని వారికి పెద్ద పదవులు కట్టబెట్టడం జగమెరిగిన సత్యం.ఇటువంటి ఈ కాలంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని మనసారా స్వాగతిస్తున్నాను జైహింద్ అని పవన్ పేర్కొన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube