చీకటిలోనే పవన్ కళ్యాణ్ ర్యాలీ..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో మూడు రోజులపాటు పర్యటించనున్న సంగతి తెలిసిందే.

జనవాని కార్యక్రమం పేరిట ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి విశాఖకి ఈరోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ చేరుకోవడం జరిగింది.

ఇక ఇదే సమయంలో విశాఖలో "విశాఖ గర్జన" కార్యక్రమం జరగటంతో విశాఖపట్నం విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.పవన్ కోసం విమానాశ్రయం వద్ద వేచి ఉన్న జనసైనికులు.

ఏపీ మంత్రుల కార్లపై రాళ్ల దాడి చేయడం జరిగింది.ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.

ఇదిలా ఉంటే విశాఖకు చేరుకున్న పవన్ కళ్యాణ్ నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు.కానీ ర్యాలీ జరుగుతున్న సమయంలో స్ట్రీట్ లైట్లు లేకపోవడంతో.

Advertisement

చీకటిలోనే పవన్ ర్యాలీ నిర్వహించారు.ఈ సమయంలో చుట్టుపక్కల కార్యకర్తలు సెల్ ఫోన్ లైట్ ల వేయడంతో పవన్ ఆ సెల్ ఫోన్ కాంతి లోనే ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

 దాదాపు మూడు రోజులపాటు విశాఖలో పర్యటిస్తూ ఉండటంతో.పవన్ తాజా పర్యటన ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు