పవన్ వెనకడుగు వెనక ముందడుగులు ఎన్నెన్నో ?  

Pawan Kalyan\'s political strategy behind the decision to withdraw Janasena from the GHMC elections , Pawan kalyan, Janasena, BJP, GHMC, GHMC Elections - Telugu Bandi Sanjay, Bjp, Ghmc Elections, Gretar, Janasena, Kishan Reddy, Pavan, Telangana Bjp

గ్రేటర్ ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని , ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతామని, కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది .పెద్దగా బలం లేని చోట పవన్ ఏ దైర్యం తో పోటీ చేయాలనుకుంటున్నారు అనే విషయం ఎవరికీ అంతుపట్టలేదు.

TeluguStop.com - Pawan Kalyans Political Strategy Behind The Decision To Withdraw Janasena From The Ghmc Elections

ఏపీలో జనసేన ,బీజేపీ పొత్తు కొనసాగుతున్న సమయంలో, పవన్ గ్రేటర్ లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించడం అందరిని మరింత ఆశ్చర్యానికి గురి చేసింది.బీజేపీ సైతం ఈ వ్యవహారంతో ఇబ్బంది పడినట్లుగానే కనిపించింది.

అయితే నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి రోజైన నిన్న అకస్మాత్తుగా గ్రేటర్ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, పూర్తిగా జనసేన బీజేపీకి మద్దతు ఇస్తుందని, ఇప్పటికే పార్టీ తరఫున నామినేషన్ వేసిన వెంటనే ఉపసంహరించుకోవాలని పవన్  పిలుపునిచ్చారు.అంతేకాదు బీజేపీ కి విజయాన్ని చేకూర్చే విషయంలో అంతా భాగస్వామ్యం అవ్వలని, పవన్ పిలుపునివ్వడం అందరికీ ఆశ్చర్యాన్ని  విస్మయాన్ని కలిగించింది.

TeluguStop.com - పవన్ వెనకడుగు వెనక ముందడుగులు ఎన్నెన్నో -Political-Telugu Tollywood Photo Image

 ఇప్పటికే జనసేన భవిష్యత్తుపై అందరికీ నీలినీడలు కమ్ముకుంటున్న సమయంలో, పవన్ నిలకడ లేని మనస్తత్వం అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సమయంలో, పవన్ ఈ నిర్ణయం తీసుకోవడం పెద్ద సాహసమే అని చెప్పాలి.అయితే పవన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా ముందు చూపు ఉన్నట్టు గానే అర్థం అవుతుంది.

ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసినా, ఒక్క స్థానం కూడా దక్కించుకునే అవకాశం లేదనే విషయం బాగా తెలుసు.పోటీ చేస్తామని ముందు ఉత్సాహంగా ప్రకటించినా, ఆ తర్వాత పవన్ ఆ తరువాత తలెత్తబోయే పరిస్థితులను లెక్కలోకి తీసుకుని పోటీ నుంచి తప్పుకున్నట్లు గా అర్ధం అవుతుంది.

ఇక్కడ గెలిచే అవకాశం లేకపోవడంతోనే బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టుగా అర్థమవుతోంది.

మొన్నటి దుబ్బాక ఉప ఎన్నికలలో బీజేపీ కి విజయం దక్కడంతో, మంచి జోష్ లో ఉంది.గ్రేటర్ లో బీజేపీ ఊహించని ఫలితాలు వస్తాయని, వివిధ సర్వే రిపోర్టులు బయటకు రావడం, ఇలా అన్నిటిని లెక్కలోకి తీసుకున్నట్లుగా కనిపిస్తున్నారు.అలాగే ఇక్కడ త్యాగం చేయడం ద్వారా ఏపీలో బీజేపీ తమకు మరింత ప్రాధాన్యం బీజేపీ ఇస్తుందని, కేంద్ర బీజేపీ పెద్దలు మరింతగా తమను గుర్తిస్తారనే అభిప్రాయం పవన్ లో ఉన్నట్టు కనిపిస్తోంది.

అందుకే విమర్శలు ఫాలో అవుతాను అని తెలిసినా, పవన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తున్నారు.

#Janasena #Gretar #Bandi Sanjay #Telangana BJP #Pavan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pawan Kalyans Political Strategy Behind The Decision To Withdraw Janasena From The Ghmc Elections Related Telugu News,Photos/Pics,Images..