పవన్ కళ్యాణ్ ఒంటరి పోరాటం.. ఈసారి కూడా ఫ్యామిలీ దూరం..!

Pawan Kalyans Lone Struggle Family Distance This Time Too

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి కూడా ఒంటరిగానే పోరాటం చేయనున్నారా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి.అన్నమెగాస్టార్ చిరంజీవి గతంలో మద్దతు ఇవ్వకపోయినా ఈసారి అయినా తమ్ముడికి తోడుగా ఉంటాడని భావిస్తే మళ్లీ హ్యాండ్ ఇవ్వబోతున్నాడని ఈ ఘటనతో మరోసారి తేటతెల్లమైంది.2014 ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినా టీడీపీకి మద్దతు ప్రకటించారు.నాడు చంద్రబాబు సీఎం అయ్యాక పవన్‌కు ఏదో ఒక పదవి దక్కుతుందని అంతా భావించారు.

 Pawan Kalyans Lone Struggle Family Distance This Time Too-TeluguStop.com

కానీ పవన్ పదవులు ఆశించకుండా ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపుతూ వచ్చారు.ఇక 2019 ఎన్నికల్లో జనసేన అధినేత ఎలాంటి పొత్తులు లేకుండా రెండు చోట్ల పోటీ చేసి ఘోర ఓటమిని చవి చూశారు.

ఒకే ఒక్క ఎమ్మెల్యే స్థానంతో సరిపెట్టుకున్నారు.నాడు మెగా ఫ్యామిలీ నుంచి పవన్‌కు పెద్దగా మద్దతు లభించలేదు.

 Pawan Kalyans Lone Struggle Family Distance This Time Too-పవన్ కళ్యాణ్ ఒంటరి పోరాటం.. ఈసారి కూడా ఫ్యామిలీ దూరం..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాబోయే 2024 ఎన్నికల్లో చిరంజీవి జనసేన తరఫున ఉంటారని, ఎన్నికల్లో తమ్ముడి తరపున ప్రచారం చేస్తారని అంతా అనుకున్నారు.కానీ అదంతా ఉత్తదేనని తేలిపోయింది.

మెగాస్టార్ చిరు సీఎం జగన్‌ను కలువడమే కాకుండా సోదరుడిగా అభివర్ణించారు.ఏపీలో సినిమా టికెట్ల సమస్య పరిష్కారం కోసం జగన్‌తో చిరు భేటీ అయ్యారని అంతా అనుకుంటున్నారు.

ఇండస్ట్రీకి చిరు పెద్దన్నగా వ్యవహరించేందుకే ఈ పెత్తనాన్ని ఎత్తుకున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.జగన్‌ను చిరు పొగడటం జనసేన అభిమానులు, కార్యకర్తలకు అస్సలు నచ్చడం లేదట.

Telugu Ap Poltics, Chiranjeevi, Janasena, Nagababu, Pawan Kalyan, Ys Jagan, Ysrcp-Telugu Political News

2009లో చిరు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ తన అన్నకోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు.అల్లు అరవింద్, నాగబాబు అందరూ ప్రజారాజ్యం కోసం పాటు పడ్డారు.అంతలా చేస్తే చిరు పార్టీ 18 స్థానాలను గెలుపొందింది.కానీ జనసేనకు గత ఎన్నికల్లో ఒక్క నాగబాబు మినహా ఎవరూ మద్దతివ్వలేదు.ప్రజాక్షేత్రంలో పవన్ ఒంటరిగానే పోరాటం చేయాల్సి వచ్చింది.గతంలో టీడీపీ, వైసీపీ పార్టీకి కూడా వారి ఫ్యామిలీ మెంబర్స్ అండగా నిలిచి ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు సాయం చేశాయి.

కానీ పవన్‌కు మాత్రం అన్న చిరంజీవి మద్దతు కరువైంది.మెగాస్టార్ ఒక్కమాట తాను జనసేనాని వైపు ఉన్నానని చెబితే చాలు అశేషమైన అభిమానులు ఆయనపై ఓట్ల వర్షం కురిపిస్తారు.

కానీ చిరు తమ్ముడిని వదిలేసి జగన్‌ను మెచ్చుకోవడం మెగా, పవర్ స్టార్ అభిమానులకు రుచించడం లేదని తెలుస్తోంది.

#Nagababu #Ysrcp #Chiranjeevi #YS Jagan #AP Poltics

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube