పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీ ఇంకా జనాల్లో నమ్మకాన్ని దక్కించుకోలేదా?

ఆంధ్రప్రదేశ్( Andra Pradesh ) రాష్ట్రంలో మరో సంవత్సరానికి అసెంబ్లీ ( Assembly )ఎన్నికలు రాబోతున్న విషయం తెలిసిందే.2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా కి అనూహ్య విజయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టబెట్టారు.ఆ సమయం లో పవన్ కళ్యాణ్( Pawan kalyan ) పార్టీ జనసేన ను ప్రజలు నమ్మలేదు.కనీసం అధినేత పవన్ కళ్యాణ్ ని కూడా గెలిపించలేదు.

 Pawan Kalyan Jana Sena Party Has Not Gained The Trust Of The People Yet Details,-TeluguStop.com

కేవలం ఒకే ఒక్క స్థానం మాత్రమే జనసేన ఖాతాలో పడింది.అది కూడా తాను డబ్బు పెట్టి గెలిచాను అన్నట్లుగా ఆఫ్‌ ది రికార్డు సన్నిహితుల వద్ద సదరు ఎమ్మెల్యే చెప్పుకొచ్చాడట.

ఆ విషయం పక్కన పెడితే గడిచిన నాలుగేళ్లలో జనసేన బలం ఎంత వరకు పెరిగింది అనే సర్వే నిర్వహిస్తే బలం అయితే భారీగానే పెరిగింది కానీ అధికారాన్ని దక్కించుకునే స్థాయిలో మాత్రం పెరగలేదు అంటూ ఫలితాలు వస్తున్నాయట.

Telugu Andra Pradesh, Assembly, Chandrababu, Janasena, Pawan Kalyan, Tactics-Pol

అంతే కాకుండా చాలా అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల శాతం పెరిగింది.కానీ గెలుపొందే స్థాయిలో బలం పుంజుకోలేక పోయారు అనేది వాస్తవం.అందుకే అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే పొత్తుల విషయంలో చంద్రబాబు నాయుడుతో చర్చలు జరపాలని ఆశపడుతున్నాడు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయాల్లో బలపడాలంటే పొత్తులతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది.ఆ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుర్తించినట్లుగా ఉన్నాడు.అందుకే పదే పదే వచ్చే సంవత్సరం పొత్తులతోనే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నాడు.40 నుంచి 50 స్థానాల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పోటీ చేస్తే భారీగా సీట్లు సొంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి అంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Andra Pradesh, Assembly, Chandrababu, Janasena, Pawan Kalyan, Tactics-Pol

ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇంకాస్త బెటర్ గా రాజకీయాలు చేయాలని అభిమానులు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.గతంతో పోలిస్తే జనసేన బలం పెరిగింది.కానీ అధికారాన్ని దక్కించుకునే స్థాయిలో భారీ ఎత్తున ఎమ్మెల్యేలను గెలిపించుకునే స్థాయిలో బలం పెరగలేదు అనేది రాజకీయ విశ్లేషకుల మాట.ఒకసారి జనసేన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెడితే అప్పుడు ప్రజల్లో మరింత విశ్వాసం దక్కించుకునే అవకాశం ఉంటుంది.కనుక ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకుండా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కనీసం 20 నుండి 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీలో అడుగు పెట్టాలని బలంగా కోరుకుంటున్నట్లు వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube